Mahesh Babu: టాలీవుడ్‌ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ షాకిచ్చింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని వెల్లడించింది. ఇదిప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేని మహేష్‌ పై ఇప్పుడు ఈడీ కన్నేయడం కలవరానికి గురి చేస్తుంది.  

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిక్కుల్లో పడ్డారు. ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ కేసుకు సంబంధించి మహేష్‌ బాబుకి ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్‌ బాబుకి ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

సూర్య డెవలపర్స్ నుంచి మహేష్‌ బాబు రూ.5.9 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో రూఐ.3.5కోట్లు నగదుగా తీసుకోగా, 2.5కోట్లు ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ ఉంది. ఈ లిక్విడ్‌గా మనీ తీసుకోవడంపైనే ఈడీ దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన భారీగా పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే సూరానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం షాకిస్తుంది. ఇందులో మహేష్‌ బాబు కి నోటీసులు జారీ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఎస్‌ ఎస్‌ ఎంబీ 29` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ప్రపంచ సాహసికుడి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.