బిగ్ బాస్ షోకి వెళ్లాలనుకున్నా వెళ్లలేం... కీలక విషయాలు వెల్లడించిన హైపర్ ఆది
బాగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, వర్షిణి... పాల్గొంటున్నారు పలుమార్లు రూమర్స్ వినిపించాయి. కానీ అది జరగలేదు. కారణం ఏమిటో తాజాగా హైపర్ ఆది వినిపించాడు.
బిగ్ బాస్ షోకి కొందరు సెలెబ్రిటీలు రావాలన్నా రాలేరన్న నిజం తాజాగా బయటకు వచ్చింది. హైపర్ ఆది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఈటీవికి మాత్రమే పని చేయడానికి కారణం ఏమిటని అడగ్గా... మాకు అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇతర ఛానల్స్ లో కామెడీ రిలేటెడ్ షోలు చేయకూడదు
ఒకటి రెండు గేమ్ షో ఎపిసోడ్స్ అయితే పర్లేదు. మూవీస్ చేయడానికి కూడా పర్మిషన్ ఉంటుంది. అయితే ఇతర ఛానల్ లో ఒక పూర్తి స్థాయి షో చేయడానికి వీలుండదు.
నేను ప్రతి సీజన్ లో బిగ్ బాస్ లో ఒక ఎపిసోడ్ చేస్తాను. దాని వలన ప్రాబ్లం లేదు. కానీ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. అగ్రిమెంట్ ఉండగా ఇతర ఛానల్స్ లో కామెడీ రిలేటెడ్ లేదా, బిగ్ బాస్ షో వంటి రియాలిటీ షోలో పాల్గొనడం కుదరదు, అని చెప్పుకొచ్చాడు.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ షోలలో పని చేసే కమెడియన్స్, యాంకర్స్... అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకి రాలేరని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ పాల్గొన్నాడు. అప్పటికి అతడు జబర్దస్త్ కమెడియన్ గా ఉన్నాడు. అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకి వచ్చినందుకు రూ. 10 లక్షలు మల్లెమాల వాళ్లకు చెల్లించినట్లు వెల్లడించాడు. మరలా అవినాష్ మల్లెమాల సంస్థ కోసం పని చేయలేదు. ఆయన స్టార్ లో ప్రసారమయ్యే షోలకే పరిమితం అవుతున్నారు.
అయితే బిగ్ బాస్ షో వలన లాభపడ్డ వాళ్ళకంటే నష్టపోయిన వాళ్లే ఎక్కువ. చాలా మంది సెలెబ్స్ నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు. నటుల నిజమైన వ్యక్తిత్వం తెలిశాక వాళ్ళను ప్రేక్షకులు అభిమానించలేకపోతున్నారు.