MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎంత ఆస్తి అమ్మేశామో అంతకి మించి కొన్నా..అనసూయతో ఆ ఒక్క స్కిట్ వల్లే, హైపర్ ఆది కామెంట్స్

ఎంత ఆస్తి అమ్మేశామో అంతకి మించి కొన్నా..అనసూయతో ఆ ఒక్క స్కిట్ వల్లే, హైపర్ ఆది కామెంట్స్

బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై హైయెస్ట్ పెయిడ్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది జబర్డస్త్ కి చాలా కాలం క్రితమే దూరమయ్యాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2024, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై హైయెస్ట్ పెయిడ్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది జబర్డస్త్ కి చాలా కాలం క్రితమే దూరమయ్యాడు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూ సినిమాల్లో కూడా హైపర్ ఆది ఆఫర్స్ అందుకుంటున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

హైపర్ ఆది రాజకీయాలతో కూడా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో హైపర్ ఆది ప్రచారం చేస్తూ ముందుకెళుతున్నాడు. 

38

ఇదిలా ఉండగా హైపర్ ఆది తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన ఫ్యామిలీ కష్టాలు, కెరీర్, తనపై వస్తున్న విమర్శలు ఇలా ప్రతి అంశం పై స్పందించాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. తానూ జాబ్ చేసే సమయానికి తన ఫ్యామిలీ బాగా అప్పుల్లో కురుకుపోయాం. నాకేమో జాబ్ చేయడం ఇష్టం లేదు. జబర్దస్త్ లోకి రాకముందు జాబ్ చేసే వాడిని. 

48

ఒకే దగ్గర కూర్చుని జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను ఇంట్లో చెప్పా. నేను జాబ్ మానేస్తున్నా. మనల్ని ముందుగా ఇబ్బంది పెట్టే అంశం చేసిన అప్పులు. నేను వేరే వర్క్ మీద ఫోకస్ చేయాలంటే ఈ అప్పుల బాధలు ఉండకూడదు. కాబట్టి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసి అప్పు కట్టేయండి అని చెప్పా. 

 

58

ఈ మాట చెప్పగానే ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేవు. నువ్వు జాబ్ మానేయడమే తప్పు. పైగా పొలం అమ్మేయమంటున్నావ్ అని అడిగారు. ఎలాగోలా ఒప్పించి పొలం అమ్మించి అప్పు కట్టేశాం. ఆ పాజిటివ్ మైండ్ సెట్ తో నా ట్యాలెంట్ పై ఫోకస్ చేసి జబర్దస్త్ లోకి వచ్చా. 

68

జబర్దస్త్ లో సక్సెస్ అయ్యాక అంత ఆస్తి అమ్మానో అంతకి కొన్ని రెట్లు ఎక్కువ ఆస్తిని కొన్నా అంటూ హైపర్ ఆది తెలిపాడు. అనసూయతో స్కిట్ చేయాలని ఎందుకు అనిపించింది అని యాంకర్ ప్రశ్నించారు. అనసూయతో నాకు మంచి రాపో ఉంది. అనసూయ నా స్కిట్ లని బాగా ఎంజాయ్ చేస్తుంది. అనసూయకి తెలుగు మీద బాగా పట్టు ఉంది కాబట్టి నేను చెప్పే ప్రతి డైలాగ్ ని అర్థం చేసుకునేది. కావలసిన రియాక్షన్ ఇచ్చేది. 

78

అనసూయ బాగా ఎంజాయ్ చేస్తుండడంతో ఆమెకి కౌంటర్లుగా స్కిట్ రాసుకునేవాడిని. ప్రతి స్కిట్ ఆమెకి ముందుగా చెప్పే వాడిని. కొన్ని సందర్భాల్లో అనసూయ స్వయంగా వచ్చి ఆది నాకు ఈరోజు ఏ డైలాగ్ రాశావు అని అడిగేది.  అయితే నాకు డైలాగ్ ఇవ్వలేదు ఏంటి అని అడిగేది. 

88

నేను తలకి గుడ్డ కట్టుకుని అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ అనసూయతో ఒక స్కిట్ చేశా. దానికి రికార్డ్ స్థాయిలో 45 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు హైపర్ ఆది తెలిపాడు. తమ కాంబినేషన్ బాగా వర్కౌట్ కావడంతో అనసూయతో ఎక్కువగా స్కిట్స్ చేసినట్లు హైపర్ ఆది తెలిపాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved