- Home
- Entertainment
- ఆడవాళ్ల నైటీలు బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాలకు హైపర్ ఆది డిమాండ్.. అందరు కలిసి చితక్కొట్టిన వైనం..
ఆడవాళ్ల నైటీలు బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాలకు హైపర్ ఆది డిమాండ్.. అందరు కలిసి చితక్కొట్టిన వైనం..
హైపర్ ఆది.. అటు జబర్దస్త్ షోలోగానీ, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో గానీ ఆయన చేసే స్కిట్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆయన చేసిన పనికి ఆడాళ్లు అందరు కలిసి చితక్కొట్టడం గమనార్హం.

హైపర్ ఆది `జబర్దస్త్`ని వదిలేసి ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కే పరిమితమయ్యారు. ఆయన లేకపోవడంతో `జబర్దస్త్` షోలకు వన్నె తగ్గిందని చెప్పొచ్చు. మునుపటి క్రేజ్, ఇంట్రెస్ట్ లేదు. కానీ తను లీడ్‌గా వ్యవహరించే `శ్రీదేవి డ్రామా కంపెనీ`తో మాత్రం ఆద్యంతం అలరిస్తున్నారు. తనదైన కామెడీ స్కిట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం రేటింగ్ పరంగా ఇది టాప్‌లో ఉందంటే కచ్చితంగా ఆది పాత్ర ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అంతకు ముందు సుడిగాలి సుధీర్ టీమ్‌తో కలిసి కామెడీ చేసేవాడు, ఇప్పుడు భాస్కర్, ఇమ్మాన్యుయెల్, రష్మి, వర్ష వంటి వారితో కలిసి స్కిట్లు చేస్తూ కామెడీని పంచుతున్నారు హైపర్ ఆది.
తాజాగా హైపర్ ఆది చేసిన పని సంచలనంగా మారింది. అంతేకాదు అది ఆడవాళ్ల ఆగ్రహానికి కారణమైంది. చివరికి ఆదికే ముప్పుగా మారింది. ఆయన చేసిన పనికి ఆడవాళ్లు అందరు కలిసి చితక్కొట్టడం గమనార్హం. దీంతో ఏదో చేయబోయిన ఆదికి ఇంకేదో అయి ఫైనల్‌గా చిత్తడైపోయింది. ఈ సంఘటన `శ్రీదేవీ డ్రామా కంపెనీ`లో చోటు చేసుకుంది. మరి ఇంతకి హైపర్ ఆది ఏం చేశాడు, ఆడాళ్లు ఎందుకు కొట్టారు, చివరికి ఏమైందనేది చూస్తే..
`శ్రీదేవి డ్రామా కంపెనీ`లో ఆది, భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయెల్, రష్మి, ప్రవీణ్, రాకేష్ వంటి మెయిన్ జబర్దస్త్ కమెడియన్లంతా కలిసి పలు సినిమాల్లోని సీన్ల స్ఫూప్‌తో ఓ స్కిట్‌ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా.. `లక్ష్మీ నరసింహా` సినిమాలోని బాలయ్య డైలాగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. `వచ్చిన మొగుళ్లు వచ్చినట్టే పెళ్లాల చేతుల్లో బలవుతుంటే.. ఈ సారి వచ్చే మొగుడు బలయ్యే వాడు కాదు, బలిచ్చేవాడు వచ్చాడురా.. హైపర్ ఆది` అంటూ తొడకొట్టి మరీ చెప్పాడు ఆది. దీంతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.
`భర్త అంటే భరించేవాడు కాదు, భరి తెగించేవాడు అని ఈ రోజు నిరూపిస్తా.. రావే` అంటూ తన భార్య(స్కిట్‌లో భార్య పాత్ర)కి హెచ్చరించాడు ఆది. స్టేజ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఇంతలోనే ఆడవాళ్ల మొత్తం హైపర్ ఆది టీమ్(మగాళ్లు) ని రౌండప్ చేశారు. అది చూసిన ఆది.. `ఇలా రౌండప్ చేయకండి.. కన్‌ఫ్యూజన్‌లో ఎవరి పెళ్లాం అని కూడా చూడను` అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆడవాళ్ల గురించి చెప్పడం ప్రారంభించాడు ఆది.
ఇందులో చెబుతూ, సంక్రాంతి పండక్కి చీర అడుగుతారు. కానీ ఆ చీర కడతారా? ఒక నైటీ ఏసుకుంటారు. ఆ నైటీతోనే పిల్లాడి ముక్కు చీదుతారు, ... కడుగుతారు, అన్నీ ఆ నైటీతోనే చేసి మళ్లీ ఆ నైటీతోనే మా దగ్గరకు వస్తారంటూ బాంబ్ పేల్చాడు. దీంతో అందరు నవ్వులు పూయిస్తే, ఆది మాత్రం మరింతగా రెచ్చిపోయాడు. అంతటితో ఆగక, ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాడు. `గవర్నమెంట్ వాళ్లకి చెబుతున్నా.. ప్లాస్టిక్‌లను కాదు, ఆ నైటీలను బ్యాన్ చేయండి మీకు దెండం పెడతా` అంటూ వార్నింగ్‌తో కూడిన రిక్వెస్ట్ చేశాడు.
అయినా తగ్గలేదు.. `రండే చూసుకుందాం` అంటూ రెచ్చిపోయాడు. దీంతో అందరు ఆడవాళ్లు కలిసి ఆది టీమ్(మగవాళ్ల)పై దాడి చేశారు. ముఖ్యంగా ఇందులో ఆదిని పట్టుకుని చితక్కొట్టారు ఆడవాళ్లు. ప్లాస్టిక్ బిండలతో కలిసి వాయించారు. `విక్రమార్కుడు` సినిమాలో రవితేజ.. ఆడవాళ్లతో గొడవ సీన్లని రిపీట్ చేశారు. ఆది తల బిందలో ఇరక్కుపోయేలా కొట్టడం హైలైట్‌గా నిలిచింది. దీంతో పాపం ఆది పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆ టైమ్‌లో కూడా `అల్లుడు తగ్గొద్దు` అంటూ నరేష్ రెచ్చగొట్టడం మరింత హైలైట్‌గా నిలిచింది.
ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ఈ పూర్తి ఎపిసోడ్‌లో వచ్చే ఆదివారం(ఈటీవీలో) ప్రసారం కానున్న విషయం తెలిసిందే. దీనికి ఇంద్రజ జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే.