- Home
- Entertainment
- నిజంగా హైపర్ ఆది కెరీర్ పాడవుతోందా, కారణం అదేనా.. సుధీర్ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది..
నిజంగా హైపర్ ఆది కెరీర్ పాడవుతోందా, కారణం అదేనా.. సుధీర్ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది..
జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది.

జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది. వాళ్ళు చేసే కామెడీ బేస్ చేసుకుని అనేక కార్యక్రమాలు సృష్టించారు. ఢీ లాంటి డాన్స్ ప్రోగ్రాం లో కూడా వీళ్ళ కామెడీ హైలైట్ అవుతోంది.
ఇదిలా ఉండగా హైపర్ ఆది, సుధీర్, ప్రసాద్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తదుపరి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగబోతున్నట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ ఎపిసోడ్ ని ఆంటీలు, అమ్మాయిల మధ్య పోటీగా మార్చారు. టీవీ సీరియల్స్ లో వచ్చే నటీనటులు, అలాగే అమ్మాయిలు ఈ షోలో పాల్గొనబోతున్నారు. ఆది, రాంప్రసాద్ కామెడీ పంచ్ లతో ఈ షో ప్రారంభం కాబోతోంది. ఆంటీలు, అమ్మాయిల మధ్య గ్లామర్ పోటీ కనువిందు కాబోతోంది. నటి కస్తూరి డాన్స్ తో అదరగొడుతోంది.
అలాగే జబర్దస్త్ లేడి కమెడియన్లు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిమానులు హైపర్ ఆదికి, సుధీర్ కి సంధించే ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. హైపర్ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనేది ఓపెన్ సీక్రెట్.
హైపర్ ఆది పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంటాడు. దీనిపై అభిమానులు హైపర్ ఆదిని ప్రశ్నించారు. మీరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అవకాశాలు తగ్గుతున్నాయా అని ప్రశ్నించారు. దీనికి హైపర్ ఆది ఏం సమాధానం చెప్పారు అనేది ఉత్కంఠగా మారింది. రేపు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఆది ఏం చెప్పాడు అనేది తేలనుంది.
అలాగే సుధీర్ కి కూడా ఫ్యాన్స్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. సుధీర్ అన్నా నువ్వు ఢీ షో లో కనిపిస్తే బావుంటుంది. ఢీ షో ఎందుకు మానేశావు అని ప్రశ్నించారు. సుధీర్ ఢీ షో ఎందుకు మానేశాడు అనేది ఎవరికీ తెలియదు. సో సుధీర్ కూడా సమాధానం చెప్పే టైం వచ్చిందన్నమాట. .