శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోటెత్తిన అభిమానులు!

First Published Mar 8, 2021, 9:16 PM IST

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు రానున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన లేటెస్ట్ మూవీ శ్రీకారం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకారం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక జరుగుతుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. చిరంజీవి ఆచార్య షూటింగ్ తెలంగాణాలో జరుపుకుంటుంది. షూటింగ్ ముగిసిన అనంతరం చిరంజీవి ఖమ్మం చేరుకొని ఈవెంట్ లో పాల్గొననున్నారు.