- Home
- Entertainment
- ఎన్టీఆర్ నా తమ్ముడు, తారక్ నుంచి చాలా నేర్చుకున్నా, వార్ 2 ఈవెంట్ లో హృతిక్ రోషన్ కామెంట్స్
ఎన్టీఆర్ నా తమ్ముడు, తారక్ నుంచి చాలా నేర్చుకున్నా, వార్ 2 ఈవెంట్ లో హృతిక్ రోషన్ కామెంట్స్
ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. తారక్ మీకు అన్న కావచ్చు, కాని నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కవ అని అన్నారు.అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ నుంచి తాను ఏం చేర్చుకున్నది వివరించాడు బాలీవుడ్ హీరో.

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ ఆపోజిట్ రోల్ చేశారు. పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించగా, తెలుగులో ఈసినిమాను సితార నాగవంశీ రిలీజ్ చేయబోతున్నారు. అగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లాంటి సినీ ప్రముకులు పాల్గొన్నారు.
KNOW
ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు
ఈ క్రమంలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ''యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీకు అన్న అయితే నాకు తమ్ముడు. ఆయన నాకు రియల్ లైఫ్ లో బ్రదర్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ లో ఉన్న ఎనర్జీ అంతా ఇంతా కాదు. ఎంత కష్ట సమయంలో అయినా సరే షూటింగ్ లో ఆ పెయిన్ తెలియకుండా చాలా అద్భుతంగా నటిస్తారు. షూటింగ్ లో ఏవైనా దెబ్బలు తగిలితే నొప్పితో నేను బాధపడుతుంటాను.. కాని ఆ నొప్పిని తన ముఖంలో చూపించకుండా షాట్ లో అద్భుతంగా నటిస్తుంటాడు ఎన్టీఆర్. అంత మంచి క్వాలిటీని నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలసిన విషయాలు చాలా ఉన్నాయి అన్నారు.
ఎన్టీఆర్ చేతి బిర్యానీ అద్భుతం
ఎన్టీఆర్ మంచి చెఫ్ కూడా. ఆయన చేతి బిర్యానీ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడే కాదు తరువాత కాలంలో కూడా తారక్ తో సినిమాలు చేసినా.. చేయకపోయినా.. ఆయన చేతి బిర్యాని కోసం నేను హైదరాబాద్ వస్తాను. మీరు తప్పకుండా నాకు మీ చేతి వంట రుచి చూపిస్తూ ఉండాలి అని అన్నారు హృతిక్ రోషన్. ఇక ఇలాంటి ప్రేమ అందరికి దొరకదు ఎన్టీఆర్ లాంటి కొంత మందికి మాత్రమే ఇది సాధ్యం. అలాంటి ప్రేమ ఈరోజు నాకు దొరికింది. తారక్ తో నాకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరు 25 ఏళ్ల సినిమా కెరీర్ ను ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాం. కాని నాకంటే నటన విషయంలో తారక్ నాకంటే సీనియర్ అయ్యి ఉంటాడు అని ఆయన అన్నారు.
తారక్ నుంచి హృతిక్ రోషన్ నేర్చుకున్న విషయం
ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆయన ఒక షార్ట్ చేస్తే అది 99 శాతం కాదు.. 100 పర్సంట్ పర్ఫెక్ట్ గా చేస్తాడు. అది ఫైనల్ షాట్ అవుతుంది. రీ టేక్ చేయాలి అన్న ఆలోచన రాదు. అది నేను చూసి నేర్చుకున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ నాకు గురువు. నేను కూడా అదే ప్రయత్నం చేస్తుంటాను'' అన్నారు హృతిక్ రోషన్. ఇక వార్ 2 సినిమాలో అగస్ట్ 14న సందడి చేయబోతున్నారు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఈసినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమా తరువాత వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈసినిమా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.