టాలీవుడ్ స్టార్స్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాని ఆ విషయం చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వారి ఫ్రెండ్షిప్ బయటపడుతుంటుంది. ఈక్రమంలో టాలీవుడ్ యంగ్ స్టార్స్ సందీప్ కిషన్,రెజీనాలు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసా?

DID YOU
KNOW
?
బెస్ట్ ఫ్రెండ్స్
టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు గా నాలుగు సినిమాలు చేసిన సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్

టాలీవుడ్‌ హీరో హీరోయిన్లలో మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేసే స్టార్స్ గా సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరిద్దరూ గతంలో కలిసి రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, మా నగరం, నక్షత్రం వంటి నాలుగు సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఎన్ని రకాలుగా ప్రచారం జరిగినా, ఎవరు ఏమనుకున్నా, సోషల్ మీడియాలో ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఈ ఇద్దరు స్టార్స్ తమ బంధాన్ని కేవలం బెస్ట్ ఫ్రెండ్‌షిప్ అని స్పష్టంగా చెప్పారు. మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు.

ఇక తాజాగా వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉందని చూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్ర‌స్తుతం రెజీనా కసాండ్రా ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ' లో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరగిన ఫ్రెండ్‌షిప్ డే థీమ్‌ లో స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు. డాన్సర్స్ అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా రెజీనాను ఇండస్ట్రీలో తన బెస్ట్ ప్రెండ్ ఎవరో కాల్ చేయమని టాస్క్ ఇచ్చారు. అప్పుడు వెంటనే రెజీనా తన బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కిషన్‌కు కాల్ చేసింది.

ఈ సందర్భంగా, రెజీనా మాట్లాడుతూ - “బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేయమంటే నీకే కాల్ చేశాను,” అని చెప్పారు. దీనిపై సందీప్ సరదాగా స్పందిస్తూ,

“అప్పుడప్పుడు అయినా ఇలాంటివి చేయడానికి నీకు ఛాన్స్ రావడం మంచిదే, నా లవ్ స్టోరీలు ఎంత బాధాకరంగా ఉంటాయో ఆ అమ్మాయికి తెలుసు అన్నారు. అంతే కాదు నీ లాంటి ఫ్రెండ్ ఉంటే అసలు పెళ్లి జరగదు,” అంటూ కామెంట్ చేశారు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.

YouTube video player

ఈ కామెంట్స్ స్టేజ్‌పై లైవ్‌లోనే రావడంతో ఈ ఎపిసోడ్ కు ఈ కామెంట్స్ ప్రత్యేకంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు తన ప్రేమ కథలు అన్నీ రెజీనాకు తెలుసు అంటే, సందీప్ కు ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయో అని కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈక్రమంలో ఆది కల్పించుకుని అన్నా మిమ్మల్ని టాలీవుడ్ సల్మాన్ ఖాన్ అంటున్నారు అంతా అని అన్నారు. నెటిజన్లు ఈ వీడియోను భారీగా షేర్ చేస్తూ వస్తున్నారు.

ఈ వీడియో ప్రోమో విడుదలైన తర్వాత, డీ షో రేటింగ్స్‌కు కూడా మంచి లిఫ్ట్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్‌లో ఉంది. చాలా కాలం తరువాత రెజీనా కూడా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.