ఓర్మాక్స్ మీడియా అక్టోబర్ నెలకు సంబంధించిన విడుదల చేసిన ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోయిన్ల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆమె గత కొన్నాళ్లుగా టాప్‌లోనే ఉంటోంది.
ఈ జాబితాలో అలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె చాలా నెలలుగా టాప్ 2లో ఉంటోంది. అలియా భట్ తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్`లో నటించిన విషయం తెలిసిందే.
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 10 లిస్ట్ లో మూడో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. ఆమె ఇప్పుడు సినిమాల కంటే యాడ్స్ తోనే ఎక్కువగా బిజీగా ఉంటోంది.
ఈ జాబితాలో రష్మిక మందన్నా నాల్గో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రష్‌గా రాణిస్తూ, వేల, వందల కోట్ల చిత్రాల్లో భాగమైన ఆమె టాప్ 4లో నిలవడం గమనార్హం.
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో త్రిష ఐదో స్థానంలో నిలిచింది. ఆమె ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ కోలీవుడ్ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.
`కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన దీపికా పదుకొనె ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఆమె ఇటీవల `స్పిరిట్`, `కల్కి 2` ల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల `తండేల్`తో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో `రామాయణ్`లో సీతగా నటిస్తోంది. ఆమె ఓర్మాక్స్ మీడియా జాబితాలో ఏడో స్థానంలో నిలవడం విశేషం.
లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తోన్న నయనతార ఈ జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ఆమె ప్రస్తుతం `మన శంకరవర ప్రసాద్`తోపాటు బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవల `మాస్ జాతర`తో పరాజయాన్ని చవిచూసిన శ్రీలీల ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం.
ఇటీవల `ఓడెల 2`తో ఆకట్టుకున్న తమన్నా.. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోయిన్ల జాబితాలో పదో స్థానంలో నిలిచింది.