MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుమని పది హిట్లు లేవు, శర్వానంద్ కి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? మైండ్ బ్లోయింగ్ స్టోరీ

పట్టుమని పది హిట్లు లేవు, శర్వానంద్ కి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? మైండ్ బ్లోయింగ్ స్టోరీ

టాలీవుడ్ టైర్ టు హీరో శర్వానంద్ కి స్టార్ హీరోలకు సమానంగా సంపద కలిగి ఉన్నాడట. హైదరాబాద్ లో సగం ఆస్తులు అతనివేనట. శర్వానంద్ ఎలా సంపాదించాడు..  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 08 2024, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. అరడజనుకు పైగా స్టార్ హీరోలు మన పరిశ్రమలో ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. సుదీర్ఘ కాలం చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే  మరోవైపు కొందరు హీరోలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే వీరందరితో సమానంగా ఒక టైర్ టు హీరోకి ఆస్తులు ఉన్నాయంటే నమ్మడం కష్టమే. హీరో శర్వానంద్ పరిశ్రమకు వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో హిట్స్ ఓ పది కూడా లేవు. అయితే పాతిక సినిమాలకు పైగా చేశాడు. శర్వానంద్ రెమ్యూనరేషన్ రూ. 5-10కోట్ల మధ్య ఉండొచ్చు. మరి శర్వానంద్ వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు?  ఆ కథ ఏమిటో చూద్దాం. 

విజయవాడకు చెందిన శర్వానంద్ హైదరాబాద్ లో చదువుకున్నాడు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి ఆయన క్లాస్ మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి వరకు వీరు కలిసి చదువుకున్నారని సమాచారం. 
 

36

2004లో శర్వానంద్ నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. యువసేన మూవీతో హీరో అయ్యాడు. నలుగురు హీరోల్లో ఒకడిగా శర్వానంద్ నటించాడు. యువసేన హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. గమ్యం, ప్రస్థానం చిత్రాలు శర్వానంద్ ని హీరోగా నిలబెట్టాయి. రన్ రాజా రన్, మహానుభావుడు, శతమానం భవతి చిత్రాలతో శర్వానంద్ టైర్ టు హీరోల జాబితాలో చేరాడు. 

 శర్వానంద్ పేరెంట్స్ బాగా స్థితిమంతులు అట. వీరిది బిజినెస్ ఫ్యామిలీ అని సమాచారం. హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా శర్వానంద్ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉంటాయట. ఒక సన్నిహితుడితో కారులో హైదరాబాద్ లో సంచరిస్తూ.. ఆ స్థలం మాదే, ఈ ఇల్లు మాదే అంటూ... పలు ఏరియాల్లో ఉన్న తమ ఆస్తులు చూపించాడట శర్వానంద్. 

46

ఈ విషయాన్ని గతంలో శర్వానంద్ ని ఓ జర్నలిస్ట్ నేరుగా అడిగారు. హైదరాబాద్ లో ప్రతి మూలన మీకు ఆస్తులు ఉన్నాయట. అసలు సగం హైదరాబాద్ మీదేనట? అని అడగ్గా... శర్వానంద్ నవ్వుతూ సమాధానం చెప్పారు. సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులు లేవు కానీ... మాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవమే అన్నాడు. అయితే ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా, టీనేజ్ నుండి నా ఖర్చులకు నేను సంపాదించుకునేవాడిని, ఫ్యామిలీ మీద ఆధారపడటం నచ్చదు.. అన్నాడు. 

 

56

కాబట్టి శర్వానంద్ కి ఉన్న ఆస్తులు ఆయన సంపాదించినవి కావు. కుటుంబ సభ్యుల ద్వారా సంక్రమించినవి. పలు ఏరియాల్లో ఆయనకున్న స్థిరాస్తుల విలువ వందల కోతలు ఉంటుందట. హీరోగా ఆయన కెరీర్ ముగిసిన ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తమ వ్యాపారాలు చూసుకుంటూ హ్యాపీగా బ్రతికేయవచ్చు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

66

గత ఏడాది జూన్ లో రక్షిత రెడ్డి అనే అమ్మాయిని శర్వానంద్ వివాహం చేసుకున్నాడు. ఇక కెరీర్ పరంగా శర్వానంద్ స్ట్రగుల్ అవుతున్నాడు. 2017లో విడుదలైన మహానుభావుడు చిత్రం తర్వాత శర్వానంద్ కి హిట్ లేదు. ఎన్ని ప్రయోగాలు చేసిన ఫలితం ఇవ్వడం లేదు. బలగం ఫేమ్ వేణుతో శర్వానంద్ ఓ చిత్రానికి సైన్ చేశాడనే పుకార్లు ఉన్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image3
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved