- Home
- Entertainment
- హనీ రోజ్ పోయి పోయి ఇలాంటి మూవీలోనా, ఫస్ట్ లుక్ తోనే అరాచకం.. సినిమా బ్యాన్ చేయాలంటూ డిమాండ్
హనీ రోజ్ పోయి పోయి ఇలాంటి మూవీలోనా, ఫస్ట్ లుక్ తోనే అరాచకం.. సినిమా బ్యాన్ చేయాలంటూ డిమాండ్
బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో ఒక ఊపు ఊపిన హనీ రోజ్.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ బ్యూటీగా మారింది. హనీ రోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన ఫొటోస్ షేర్ చేస్తూ యువతని మైమరపిస్తూ ఉంటుంది.

బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో ఒక ఊపు ఊపిన హనీ రోజ్.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ బ్యూటీగా మారింది. హనీ రోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన ఫొటోస్ షేర్ చేస్తూ యువతని మైమరపిస్తూ ఉంటుంది. ఆమె హాట్ హాట్ షేపులకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. తన స్ట్రక్చర్, అందంతో సౌత్ లో హనీ రోజ్ క్రేజీ హీరోయిన్ గా మారింది.
వీర సింహారెడ్డి చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు.
అయితే వీరసింహారెడ్డి తర్వాత హనీ రోజ్ ఎలాంటి చిత్రంలో నటిస్తోంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తప్పకుండా మంచి గ్లామర్ పాత్ర చేస్తుందని భావించారు. తాజాగా హనీ రోజ్ ఫ్యాన్స్ కి, సినీ లవర్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రంలో ప్రధాన పాత్రలో హనీ రోజ్ నటిస్తోంది. అది అలాంటి ఇలాంటి బోల్డ్ మూవీ కాదు. ఫస్ట్ లుక్ చేస్తే హనీ రోజ్ ఎంత ఘాటైన పాత్రలో నటిస్తుందో అర్థం అవుతుంది.
హనీ రోజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ రాచెల్. తెలుగులో ఈ చిత్రానికి రాహేలు అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెలుగు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఆనందిని బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ చూస్తే హనీ రోజ్ ఫ్యాన్స్ ఆశ్చర్యంలో మునిగిపోతారు.
పైన పైట లేకుండా కేవలం బ్లౌజ్ తో బోల్డ్ అందాలు చూపిస్తూ.. బీఫ్ మాంసం అమ్మే మహిళగా సీరియస్ లుక్ తో షాకిచ్చింది. చేతిలో కట్టి పట్టుకుని బీఫ్ కొడుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హనీ రోజ్ కనిపిస్తోంది. అంతే కాదు ఆమె చుట్టూ దున్నపోతుల తలకాయలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో దుమారం మొదలయింది. హనీ రోజ్ పోయి పోయి ఇలాంటి చిత్రాల్లో నటిస్తోంది ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హనీ రోజ్ లాంటి హీరోయిన్ ని ఇలా మార్చేసారేంట్రా అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
పశువుల నరికివేతపై ఇప్పటికి ఇండియా మొత్తం దుమారం చెలరేగుతోంది. పైగా హనీ రోజ్ లాంటి బ్యూటీ బోల్డ్ గా కనిపిస్తుండడంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం క్రైమ్, బోల్డ్ చిత్రాలకు ట్రెండ్ ఉంది. కానీ హనీ రోజ్ లాంటి హీరోయిన్ ఇలాంటి కథలు ఎంచుకోవాల్సి అవసరం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రాహేలు ఫస్ట్ లో వివాదంగా మారుతోంది.