- Home
- Entertainment
- స్నేహ పరువాల విందు.. రెడ్ లెహంగా చోళీలో గేట్ వద్ద హోయలు పోతూ కైపెక్కించే పోజులు.. చూస్తే రచ్చే
స్నేహ పరువాల విందు.. రెడ్ లెహంగా చోళీలో గేట్ వద్ద హోయలు పోతూ కైపెక్కించే పోజులు.. చూస్తే రచ్చే
స్నేహ ట్రెడిషన్ లుక్‌లో అదరగొడుతుంది. కానీ ఆమె అందం పొట్టి దుస్తుల్లో కంటి ట్రెడిషనల్ లుక్‌లోనే మరింత పెరుగుతుండటం విశేషం. ఇప్పుడు మరోసారి పరువాల విందుతో మతిపోగొడుతుంది.

హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న స్నేహ(Sneha) సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ లెహంగా చోళీలో మెరిసింది. హాట్ పోజులతో పరువాల విందు చేస్తుంది. గేట్ వద్ద హోయలు పోతూ స్నేహ ఇచ్చిన పోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి.
ప్రస్తుతం స్నేహ నయా ఫోటో షూట్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో మతిపోగొడుతుంది. తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. వారికి కావాల్సిన విజువల్ ట్రీట్ ఇస్తుంది.
జనరల్‌గా పొట్టి దుస్తుల్లో గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకుంటారు హీరోయిన్లు. కానీ స్నేహ అందుకు భిన్నం. ఆమె సహజమైన అందాలతో ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ లుక్‌లోనే మరింత అందంగా ఉంటుంది. ఆమె మోడ్రన్ దుస్తులేసినా ఇంతటి అందంగా ఉండదేమో అనేట్టుగా ఉంటుంది.
స్నేహ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. `మీరు ప్రస్తుత మూవ్‌మెంట్‌ని ఆస్వాదిస్తున్నప్పుడు మీ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది` అని పేర్కొంది. ప్రస్తుత జీవితంలో ఉండాలని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని తెలిపింది స్నేహ.
హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న స్నేహ సినిమాల్లోనూ సాంప్రదాయ పాత్రల్లోనే మెరిసింది. ఒకటి రెండు పీరియడ్ మూవీస్‌లో కాస్త గ్లామర్‌గా కనిపించినప్పటికీ, ఆమె ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసింది. అందులోనే మరింత అందంగా ఆకట్టుకుంది. వెండితెరపై మెస్మరైజ్ చేసింది.
అయితే మ్యారేజ్ తర్వాత హీరోయిన్‌గా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. స్నేహ. ఆమె ఫ్యామిలీకే పరిమితమయ్యింది. నటుడు ప్రసన్నని స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వాళ్లు పెద్ద అవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది స్నేహ. మంచి బలమైన పాత్రల్లోనే మెరుస్తుంది. తన నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే చేస్తుంది. అందుకే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఇటీవల కాలంలో ఆమె తెలుగులో కేవలం `సన్నాఫ్ సత్యమూర్తి`,`వినయ విధేయ రామ` చిత్రాల్లోనే మెరిసింది. దీన్ని బట్టే అర్థమవుతుంది. ఆమె ఎంత సెలక్టీవ్‌గా ఉంటుందనేది.
అదే సమయంలో ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తుంది. అందులో భాగంగానే ఇలా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు ఆమె ఇలా ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.