Hollywood Effect On Indian Movies: ఇండియన్ సినిమాకు హాలీవుడ్ దెబ్బ..
ఇండియన్ సినిమాకి హాలీవుడ్ ఫీవర్ పట్టుకుంది. ప్రతీ సారి మన మార్కెట్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి హాలీవుడ్ సినిమాలు . కొవిడ్ టైమ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ని కాపాడేలా పాన్ ఇడియా సినిమాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అవుతుంటే..వాటిని దెబ్బతీసేలా హాలీవుడ్ మూవీస్ ఇండియన్ స్క్రీన్ పై వాలిపోతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కోవిడ్ నుంచి కోలుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తుంటే.. వాటిని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ దెబ్బకొడుతున్నాయి. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ సంస్థల నుంచి వచ్చే సినిమాల వల్ల మన ఇండియన్ సినిమాల మార్కెట్ కు పెద్ద దెబ్బ పడుతుంది. దానికి మెయిన్ కారణం ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్. ఆ క్రేజ్ కారణంగానే వాటిని లోకల్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రతీ సీజన్ లోనూ వీటి నుంచి మన సినిమాలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రీజన్ తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై హాలీవుడ్ షేర్ ఎఫెక్ట్ బలంగా కనిపిస్తోంది.
ఈ శుక్రవారం(డిసెంబర్ 24) సౌత్ లెవెల్ లో శ్యామ్ సింగ రాయ్... పాన్ ఇండియా లెవెల్ లో 83 రిలీజ్ కాబోతున్నాయి. రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇవే ఒకదానికొకటి పోటీ అనుకుంటే... వీటికి తోడు... ఇంకా చెప్పాలంటే రెండు రోజుల ముందే ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ రిలీజ్ అయింది. ఈ హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా నటించడం మరో ప్లస్ పాయింట్. క్రిస్ మస్ సీజన్ ని క్యాష్ చేద్దామనుకుంటోన్న ది మ్యాట్రిక్స్ 4.
అంతెందకు రీసెంట్ రిలీజ్ ల విషయాన్నే చూసుకుంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప : ది రైజ్` కంటే ఒకరోజు ముందు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో రిలీజైంది. ఒక్క రోజులోనే అక్షరాల 37 కోట్లు వసూలు చేసింది. ఇండియా భాక్సాఫీస్ లో ఈ ఏడాది ఇంత భారీ ఓపెనింగ్ సాధించిన డబ్బింగ్ సినిమా ఇంకోకటి లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది. ఇండియన్ మార్కెట్ పైన హాలీవుడ్ ప్రభావం ఎంత ఉందో. అంతేకాదు హాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ హౌజ్ మార్వెల్స్ నుంచి ఈ ఇయర్ వచ్చిన మూడవ సినిమా ఇది. స్పైడర్ మ్యాన్ బరిలో లేకుంటే పుష్ప కలెక్షన్స్ భారీగా పెరిగి ఉండేవనేది మేకర్స్ అంచనా.
రీసెంట్ గా అక్షయ్ కుమార్ సినిమా పై కూడా ఫారెన్ సినిమాల ప్రభావం పడింది. `షాంగ్ - చీ`, ఎటర్నల్స్ వంటి సినిమాలు మనదేశంలో మంచి వసూళ్లని రాబట్టాయి. ఈ సినిమాల టైమ్ లోనే సూర్యవంశీ` సినిమా రిలీజ్ అయ్యింది. దాంతో సీనిమా కలెక్షన్స్ పై ఈ ప్రభావం కనిపించింది. ఇప్పటికే సూర్య వంశీ కలెక్షన్స్ బాగున్నాయి అన్నారు. కాని ఈ హాలీవుడ్ సినిమాలు లేకుంటే ఇంకా ఎక్కువే వచ్చేయంటున్నారు మేకర్స్. ఇప్పుడే కాదు గతంలోనూ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల హవా ఇండియాలో సంచలనానలే సృష్టించింది. ఇలాంటి రికార్డ్స్ ను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ సినిమా లిక్కడ సైలెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాయి.
వచ్చే ఏడాది కూడా చాలా హాలీవుడ్ సినిమాలు ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని ఉన్నాయి. రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా డైరెక్టర్ మాట్ రీవ్స్ దర్శకత్వంలో రూపొందుతున్న బ్యాట్ మ్యాన్ మార్చి 4న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక అదే రోజు ఇండియన్ బాక్సా ఫీస్ దగ్గరకు అక్షయ్ కుమార్, కృతి సనన్ నటిస్తున్న బచ్చన్ పాండే రాబోతోంది. మరోసారి అక్షయ్ సినిమాకు హాలీవుడ్ ఇబ్బంది తప్పడంలేదు.
సౌత్ నార్త్ అనే భేదం లేదు అన్ని భాషల సినిమాలపైన కూడా హాలీవుడ్ ప్రభావం గట్టిగా చూపించబోతోంది. పాన్ ఇండియా లెవల్లో అందరూ ఎదురు చూస్తున్న యాక్షన్ ఫిల్మ్ కేజీయఫ్: చాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. అదే రోజు బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్ధా రిలీజ్ కూడా ప్రకటించారు అమీర్. అంతే కాదు తప్పక ఆ డేట్ తీసుకున్నానని.. క్షమించాలంటూ కెజియఫ్ టీమ్ కు అమరీ ఖాన్ లెటర్ కూడా రాశారు. కెజియఫ్2కి ప్రమోషన్ కూడా చేసి పెడతానన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే.. ఇదే రోజు బాక్సాఫీస్ బరిలోకి ఫెంటాస్టిక్ బీస్ట్స్ దిగబోతున్నారు. ఒక రోజు తేడాలో అంటే ఏప్రిల్ 15న వార్నర్ బ్రదర్స్.... ది సీక్రెట్స్ ఆఫ్ డంబెల్డోర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఎంత కాదనుకున్నా.. మన సినిమాలపై.. ఆ సినిమాల ప్రభావం తప్పదనే చెప్పాలి. అయతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఈలోపు కోవిడ్ థర్డ్ వేవ్ కనుక వస్తే.. ఈ సినిమాలన్నింటికి ఇంకా పెద్ద దెబ్బ తగలడం ఖాయమనే చెప్పాలి.
రీసెంట్ గా హృతిక్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ డేట్ ప్రకటించింది. తమిళ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదకి హిందీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్నుంచి పెద్ద సినిమా ఢీకొట్టబోతోంది. టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 కూడా అదే రోజున రిలీజ్ కాబోతోంది. అసలే టామ్ క్రూజ్.. అందులోను మిషన్ ఇంపాజిబుల్.. మరి అప్పటి వరకూ ఈ సినమా రిలీజ్ డేట్ ఇలానే ఉంటుందా.. లేకు మార్చుకుంటుందా అనేది చూడాలి.ఇక ఇవే కాదు హాలీవుడ్ నుంచి థోర్, డాక్టర్ స్ట్రేంజ్ 2, యాంట్ మ్యాన్, బ్లాక్ పాంథర్, ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డం, ది మార్వెల్స్ ఇలా ఫేమస్ సినిమాలు ఇండియాన్ బాక్సాఫీస్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి. అసలే మన వాళ్లను కోవిడ్ పీల్చి పిప్పి చేసింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల దెబ్బ కూడా గట్టిగానే తగులుతుంది.