NTRతో వర్క్ చేయాలని ఉంది.. ఏదో రోజు జరుగుతుంది.. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కామెంట్స్..
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్ గన్ (James Gunn) ఏదో ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ (NTR)తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తారక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) క్రేజ్ వరల్డ్ వైడ్ పెరిగిన విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ దక్కడం, RRRలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ కు నచ్చడంతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు గుర్తింపు దక్కింది. హాలీవుడ్ దర్శకులు సైతం వారిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
గతంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్ బర్గ్ పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ (Guardians of the Galaxy) వాల్యూమ్ 3 డైరెక్టర్ జేమ్స్ గన్ (Jamesh Gunn) కూడా గతంలో ‘ఆర్ఆర్ఆర్’ నటులను ప్రశంసించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ను గుర్తు చేశారు.
గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా ప్రముఖ ఛానెల్ కు జేమ్స్ గన్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ‘గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?’.. అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్ తారక్ అని బదులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
జేమ్స్ గన్ మాట్లాడుతూ... గతేడాది బిగ్ సినిమాగా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ నటుడు.. బోనులోంచి పులులతో బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అమేజింగ్, కూల్’ అంటూ కామెంట్ చేశారు.
అతని కోసం ప్రత్యేకమైన పాత్ర ఉందా? అని అడగగా, ఉందని చెప్పారు. ‘ఇప్పుడే తెలిదు. దానికి కొంచెం సమయం పడుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే తారక్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వస్తున్న War2లో నటించబోతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.