- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్య, నిరుపమ్ పెళ్లి జరగాలని ముడుపు కట్టిన హిమ.. మళ్లీ అపార్థం చేసుకున్న జ్వాల!
Karthika Deepam: శౌర్య, నిరుపమ్ పెళ్లి జరగాలని ముడుపు కట్టిన హిమ.. మళ్లీ అపార్థం చేసుకున్న జ్వాల!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), స్వప్న పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటారు. ఇంతలోనే అక్కడికి శోభ వస్తుంది. అప్పుడు శోభ(shobha)పెళ్లి పత్రిక చూసి కుళ్లుకుంటుంది. ఆ తర్వాత ఏంటి ఆంటీ బయట జ్వాలా ఆటో ఉంది అని స్వప్నని అడుగుతుంది. అప్పుడు స్వప్న జరిగింది మొత్తం వివరిస్తుంది. ఆ తర్వాత స్వప్న కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు శోభ, జ్వాలా (jwala)ఆటో ఎందుకు వెనక్కి ఇచ్చేసింది అనడంతో నిరుపమ్ జరిగింది చెప్పడంతో జ్వాల సంతోష్ పడుతూ పెళ్లి ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు జ్వాలా,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. దానికి అంతటికి కారణం హిమనే అని హిమ(hima)పై కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే సౌందర్య, ఆనంద్ రావు లు వస్తారు.
అప్పుడు జ్వాలా ఆనంద్ రావు(soundarya) ని యంగ్ మ్యాన్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏమయింది సిసి ఎలా ఉన్నావు అని అనగా నీ పర్మిషన్ లేకుండా మేము ఒక పని చేశాము అని చెబుతుంది. అప్పుడు సౌందర్య(soundarya) ,నువ్వు కోప్పడుతున్న తింగరిని తీసుకు వచ్చాను అనడంతో జ్వాలా కోపంతో రగిలి పోతూ ఉంటుంది.
అప్పుడు సౌందర్య,హిమ(hima) గురించి చెబుతూ ఉండగా జ్వాలా మాత్రం కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు హిమ ఎదురు పడటంతో జ్వాలా కోపంతో విరుచుకు పడుతుంది. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావే అంటూ సిగ్గులేని దానా అంటూ తిడుతుంది. అప్పుడు సౌందర్య(soundarya)ఆనంద్ రావులు ఎంత ఆపుతున్నా జ్వాలా ఆగకుండా హిమను మెడబట్టి బయటకు గెంటేస్తుంది. అప్పుడు హిమ ఎంత చెప్పినా వినకుండా కోపంతో రగిలిపోతుంది.
ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా జ్వా(jwala)లా హిమ ను గెంటేస్తుంది. అది చూసి ఆనంద్ రావ్,సౌందర్య బాధపడుతూ ఉంటారు. జ్వాలా వారిపై సీరియస్ అవుతూ ఇలాంటి రాయబారాలు చేయాలి అనుకుంటే ఇంకొకసారి మా ఇంటికి రావద్దు అని అంటూ వారి ముఖం పై తలుపులు వేస్తుంది. మరొక వైపు హిమ(hima)జరిగిన విషయాన్ని తలుచుకుని బాధ పడుతూ ఉండగా సౌందర్య, ఆనందరావు లు ఓదారుస్తారు.
కానీ హిమ మాత్రం బాధ పడుతూ ఎలా అయిన సౌర్య,నిరుపమ్(Nirupam)ని కలపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత దుర్గ జ్వాలా ఆటో కి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు. మరొకవైపు నిరుపమ్, హిమ(hima) గుడిలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిరుపమ్ పెళ్లి ఫిక్స్ అయినందుకు అమ్మవారికి ముడుపు కడతాను అని అనగా, అప్పుడు వెంటనే హిమ నీకు,జ్వాలా కి పెళ్లి జరగాలని నేను ముడుపు కడతాను అనడంతో నిరుపమ్ షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ముడుపులు కడుతూ ఉండగా అది చూసిన జ్వాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.