Karthika Deepam: కార్తీక్, దీప లను చూసిన హిమ.. హిమను తప్పుగా అపార్థం చేసుకున్న శౌర్య?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 27 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో చారుశీల దీపకు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయి లేదో పండరి కు ఫోన్ చేయాలి అనుకుంటుండగా ఇంతలో పండరి అక్కడికి వస్తుంది. చెప్పు చారమ్మ ఆనంతో దీపకు ఇచ్చిన మందులు సరిగా ఇస్తున్నావా అనగా ఇస్తున్నాను కానీ మీరు ఇచ్చిన మందులు వేసుకున్న తర్వాత గుండెల్లో మంటగా అనిపిస్తోంది అని చెప్పగా అయితే మందులు పనిచేస్తున్నాయన్నమాట అనుకుంటూ ఉంటుంది చారుశీల. గుండెల్లో మంట వచ్చిన ఏమి వచ్చిన నువ్వైతే దీప కు మందులు ఇవ్వడం మానేయకు మొదట్లో అలాగే ఉంటుంది తర్వాత బాగవుతుంది అని అబద్ధాలు చెబుతుంది చారుశీల. దాంతో అసలు విషయం తెలియక పండరి సరే అని అంటుంది.
మరొకవైపు సౌందర్య, ఆనంద్ రావు కార్లు వెతుకుతుండగా అప్పుడు సౌందర్య గుళ్ళు హాస్పిటల్ మొత్తం అన్ని వెతికాను ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది సౌందర్య. ఇదే ఊర్లో ఉన్నారో లేదో అని సౌందర్య అనగా ఉంది కూడా మనకు కనిపించకుండా దాక్కుంటున్నారేమో అని అంటాడు ఆనంద్ రావు. ఏం మాట్లాడుతున్నారు అనడంతో నిజమే సౌందర్య మనకి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటున్నారు ఏమో అందుకే మనం కనిపించలేదేమో అని అంటాడు. అలా మాట్లాడకండి నాకు ఆ మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది ఖచ్చితంగా కనిపిస్తారు అని అంటుంది సౌందర్య. అప్పుడు ఆనంద్ రావు నాకెందుకో మన చుట్టూ ఉన్న వారిపై అనుమానం వస్తుంది నిజం తెలిసి కూడా మన దగ్గర నిజం చేస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటాడు.
అప్పుడు సౌందర్య నాక్కూడా అలాగే అనిపిస్తుంది అని అనుమాన పడుతుంది. మరొకవైపు దీప,కార్తీక్, ఇంద్రుడు ఒకచోట కలుసుకుంటారు. అప్పుడు దీప నీ గురించి చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇంద్రుడు మా బిడ్డను మాకు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఊర్లు తిరుగుతున్నావు అనుకున్నాను. కానీ మా కంటే బాగా చూసుకుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేము అని అనగా అలాంటి పెద్ద మాటలు ఎందుకమ్మ అంటాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు నీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది అమ్మ అని దీప కండిషన్ గురించి మాట్లాడుతూ ఉండగా కార్తీక్ చెప్పొద్దు అని సైగ చేస్తాడు. ఇప్పుడు కార్తీక్ నాటకాలు ఆడుతూ మా ప్రాణాలకే ప్రమాదం లేకపోతే అందరం కలిసి ఉండే వాళ్ళం అని అంటాడు.
అప్పుడు దీప శౌర్య వాళ్ళ నాన్నమ్మ తాతయ్యల దగ్గర ఉంటే బాగుండేది అని అనగా ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉందమ్మా అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు దీప షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావ్ ఇంద్రుడు అనడంతో అవును సార్ నిన్ననే మీ అమ్మానాన్న వాళ్ళు వచ్చారు మేమందరం ఒకటే ఇంట్లో ఉన్నాం పెద్ద ఇల్లు తీసుకున్నారు వాళ్ళు జ్వాలమ్మ కోసం ఇక్కడికే వచ్చేసారు అని అంటాడు. దాంతో దీప,కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు దీప సంతోష పడుతూ ఉంటుంది. హిమ కూడా వచ్చిందా అని దీప అడగగా వచ్చింది అనడంతో డాక్టర్ బాబు నేను హిమను చూడాలి అని అంటుంది దీప. ఇంతలో అదే దారిలో హిమ నాతో శౌర్య ఇంకా మాట్లాడటం లేదు అమ్మానాన్నలు బతికే ఉన్నారు అంటుంది కానీ వాళ్ళు కనిపించడం లేదు అనుకుంటూ ఉంటుంది.
అమ్మ నాన్న నేను కూడా వెతుకుతాను అనుకుంటూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది హిమ. ఎలా అయినా అమ్మానాన్నలను వెతికి శౌర్య ముందు నిలబెట్టి నాతో మాట్లాడించేలా చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప శౌర్యని ఎలా అయితే చూపించావో మా అత్త మామయ్యలని నా కూతురు హిమ ను చూపించాలి అని ఇంద్రుడిని అడుగుతుంది. అప్పుడు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో హిమ అదే రూట్ లో వస్తుండడంతో అది చూసి ఇంద్రుడు సార్ మీ కూతురు హిమ వస్తోంది అని అంటాడు. అప్పుడు హిమ చూసి దీప నా బిడ్డ బాబు హిమ అని అరుస్తూ ఉండగా ఆగు గట్టిగా అరవకు అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ దీప బలవంతంగా పక్కకు పిలుచుకొని వెళ్తుండగా అది చూసి హిమ షాక్ అవుతుంది.
అమ్మ డాడీ అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ వాళ్ళు లేకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీప వాళ్ళు హిమ వెనక చెట్టు చాటున దాక్కొని హిమను ఏడుస్తుంటే చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు దీప కళ్ళ ముందు బిడ్డ నాకోసం ఆరాటపడుతున్న చూసి దగ్గరకు కూడా తీసుకోలేకపోతున్నానే ఎందుకు నాకు ఈ బతుకు డాక్టర్ బాబు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు చారుశీల, పండరీకి ఫోన్ చేసి దీప హెల్త్ గురించి అడుగుతూ ఉంటుంది. ఈపాటికి దీపకు గుండెపోటు రావాలి కదా ఇంకా కాల్ రావడం లేదేంటి అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇప్పుడు గుండెపోటు లేకపోతే పండరిని డోస్ పెంచమని చెప్పాలి అనుకుంటూ దీపను చంపేయడానికి ప్లాన్ వేస్తుంది చారుశీల. మరొకవైపు హిమ ఇంటికి వెళ్లి నానమ్మ తాతయ్య అందరూ కిందికి రండి అని గట్టిగా అరుస్తుంది.
ఇప్పుడే అమ్మ నాన్నలను చూశాను అనడంతో సౌందర్య ఆనందరావు సంతోషపడతారు. కానీ సౌర్య మాత్రం హిమ మాటలను నమ్మదు. అబద్ధం అంతా అబద్ధం అని అనగా లేదు సౌర్య నిజంగానే చూసాను అని అంటుంది హిమ. అంతలోనే కనిపించి అంతలోనే మాయం అవుతారా చూసావా బాబాయ్ హిమకి అమ్మానాన్నలు కనిపించారంట జోక్ చేస్తోంది అనడంతో జోకు కాదు అమ్మ నిజంగానే చూసింది అనుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. అప్పుడు హిమ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించిన శౌర్య పొగరుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నాన్నలు ఉన్నారని అబద్దం చెబితే నేను తనతో మాట్లాడుతానని అబద్ధాలు చెబుతోంది తాతయ్య అని అంటుంది సౌర్య. వాళ్లు బతికే ఉన్నారని కాదు హిమ వాళ్ళను నువ్వు నిజంగానే నీతో పాటు పిలుచుకొని వచ్చినా నేను నీతో మాట్లాడను అనడంతో అందరూ షాక్ అవుతారు. మరొకవైపు దీప కు హార్ట్ స్ట్రోక్ రావడంతో కార్తీక్ హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. పండరీ దీప ని చూసి భయపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు.