రకుల్ తో ప్రగ్యా స్విమ్మింగ్ పూల్ పార్టీ... జాయిన్ అయిన టాలీవుడ్ స్టార్ కిడ్!
రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరు తరచుగా పార్టీలలో ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా వీరు పూల్ పార్టీ చేసుకున్నారు. సదరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Pragya Jaiswal
పూల్ పార్టీ ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు షేర్ చేసింది. సదరు ఫోటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వీరిద్దరితో స్టార్ కిడ్ మంచు లక్ష్మి జాయిన్ అయ్యింది. వీరు ముగ్గురు మంచి మిత్రులు కాగా తరచుగా కలుస్తూ ఉంటారు.
Pragya Jaiswal
ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. ప్రగ్యా జైస్వాల్ మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా అంతగా ఆడలేదు.
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది.
Pragya Jaiswal
కంచె అనంతరం గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
Pragya Jaiswal
చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pragya Jaiswal
చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు.