నా బ్యాడ్ వీడియో తీసి .. వైరల్ చేశాడు, హీరోయిన్ యామీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఫేమస్ అయిపోయింది.. హీరోయిన్ గా అవకాశాల కూడా సాధించింది ముద్దుగుమ్మ యామీ గౌతమ్. అయితే రీసెంట్ గా తన లైఫ్ లో అభిమాని వల్ల పడ్డ ఇబ్బందిని అభిమానులకు ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది.

సెలబ్రిటీలకు ఎంత ఇమేజ్ ఉంటుందో... అన్ని కష్ాలు కూడా ఉంటాయి. అంత హెరాజ్ మెంట్ కూడా ఉంటుంది. టీజ్ చేస్తుంటారు.. బయటకు వెళ్తే.. ఊపిరి మెసలకుండాచుట్టుముడతారు. సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ గురించి రకరకాలుగా పెడుతుంటారు. ఇక మరికొంత మంది ఇకాస్త శృతి మించి ఇబ్బందులు పెడుతుంటారు. అలా ఓ అభిమాని వల్ల ఇబ్బంది పడిందంట హీరోయిన్ యామీ గౌతమ్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో యామీ మాట్లాడుతూ.. తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని వివరించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఒక సారి హిమాచల్ ప్రదేశ్ లోని మా ఊరికి వెళ్లాను. అప్పుడు ఓ కుర్రాడు.. నా స్టాఫ్ దగ్గర అనుమతి తీసుకుని నాతో ఫొటో దిగేందుకు వచ్చాడు. నేను కాస్త ఓపెన్ గా మాట్లాడుతూ అతడితో ఫొటో దిగాను.
అది చిన్న టౌన్ కాబట్టి ప్రజలు అలా రావడం, మాట్లాడటం చాలా సాధారణ విషయం. అది నాకు సంతోషంగానే అనిపించింది. కాని అప్పుడు అతను చేసిని పనిని నేను గమనించలేక పోయాను అన్నారు యామి.
ఫోటో కోసం వచ్చిన అతడు తెలియ కుండానే నా వీడియో తీశాడు. అది కూడా చాలా బ్యాడ్ వీడియో. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి.. మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాడు. ఆ వీడియో సక్సెస్ అయిందని సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత.. మరికోంత మంది కెమెరా పట్టుకుని మా ఇంటికి వచ్చారు. అదంతా చూసి నేను ఒక్కసారిగా షాకయ్యానుక అన్నారు యామీ గౌతమ్.
ప్రతీ మనిషికీ వ్యాక్తిగత జీవితం ఉంటుంది. దానిని అందరూ గౌరవించాలి. కాని అతను చీసిని వీడియో ఇది చాలా సాధారణ విషయం అన్నట్టు సిగ్నల్ ఇచ్చేలా ఉంది. అందుకే కెమెరా పట్టుకుని నా దగ్గరకు వచ్చారు. కాని.. నేను వారికి నచ్చ చెప్పి పంపించాను.. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వాటికి ప్రైవసీ కచ్చితంగా ఉండాలి అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది.
ఇక టాలీవుడ్ లో సినిమాలు చేసింది బ్యూటీ... నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు చేసింది. ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో.. టాలీవుడ్ లో ఆఫర్లు రాలేదు. దాంతో ఇక్కడ నుంచి జెండా ఎత్తేసి.. బాలీవుడ్ లో పాతేసింది. అక్కడ కు షిప్ట్ అయిపోయింది. 2012లో ఫస్ట్ టైం హిందీ మూవీలో యాక్ట్ చేసిన యామీ.. 2017 నుంచి పూర్తి అక్కడే నటిస్తూ బిజీగా మారిపోయింది.
2021లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా లాస్ట్ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిందిబ్యూటీ. ఆఫర్లు వస్తే వెబ్ కంటెంట్ ద్వారానేజనాల్లోకి వెళ్ళాలన ప్రయత్నం చేస్తోంది.