- Home
- Entertainment
- హీరోయిన్ రోజూ తన గదికి వస్తోందని శోభన్ బాబు ఏం చేశారో తెలుసా..అంత నిగ్రహంగా ఉన్నప్పటికీ..
హీరోయిన్ రోజూ తన గదికి వస్తోందని శోభన్ బాబు ఏం చేశారో తెలుసా..అంత నిగ్రహంగా ఉన్నప్పటికీ..
శోభన్ బాబు పౌరాణిక చిత్రాలతో కూడా తనదైన ముద్ర వేశారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి చిత్రాల్లో నటించారు.

Sobhan Babu
ఏఎన్నార్ తర్వాత మహిళల్లో విశేషమైన ఆదరణ పొందిన హీరో అంటే అది శోభన్ బాబు మాత్రమే. శోభన్ బాబు అందానికి అప్పట్లో మగువలు ఫిదా అయ్యే వారు. హీరోయిన్లు అయితే చాలా మంది శోభన్ బాబుతో ఫ్రెండ్ షిప్ చేయాలని ప్రయత్నించారు.
Sobhan Babu
శోభన్ బాబు పౌరాణిక చిత్రాలతో కూడా తనదైన ముద్ర వేశారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి చిత్రాల్లో నటించారు. సంపూర్ణ రామాయణం చిత్ర షూటింగ్ గురించి ప్రముఖ రచయిత కానగల జయకుమార్ సంచలన విషయాలు రివీల్ చేశారు. మారేడు మిల్లిలో అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతోంది. దగ్గర్లోని హోటల్ లో బస ఏర్పాటు చేశారు.
అది డిసెంబర్ నెల. చలి వణికించే విధంగా ఉంది. షూటింగ్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ లో కొంత మంది హోటల్ దగ్గరలో ఫైర్ క్యాంప్ వేసుకునేవారు. శోభన్ బాబు హీరో కదా.. ఆయన రారేమో అనుకున్నాము. కానీ ఒకరోజు ఆయన రగ్గు కప్పుకుని సైలెంట్ గా వచ్చి మాతో పాటు ఫైర్ క్యాంప్ లో కూర్చున్నారు.
కాసేపటి తర్వాత నన్ను పిలిచి తమ్ముడు నా రూమ్ కి వెళదాం రా అని రమ్మన్నారు. రూమ్ కి వెళ్ళాక మాటలు చెప్పుకుంటూ ఉండగా.. ఒక పాట పాడమన్నారు. తాను 'ఒకే మాట ఒకే బాణం ఒక్క భామకు రాముని ప్రేమ' అనే సాంగ్ పాడాను. పాట బావుండడంతో మళ్ళీ మళ్ళీ పాడమన్నారు.
అంతకు ముందు శోభన్ బాబు క్యాంప్ ఫైర్ కి వచ్చేవారు కాదు. కానీ ఆ తర్వాత రోజూ రావడం ప్రారంభించారు. ఎందుకు ఈయన రోజూ వస్తున్నారు, పైగా నన్ను ఆయన గదికి తీసుకెళుతున్నారు అని ఆలోచించా. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సంపూర్ణ రామాయణం చిత్రంలో హీరోయిన్ గా నటించిన చంద్రకళ ఉండేది శోభన్ బాబు పక్క గదిలోనే.
ఆమెకి బోర్ కొట్టి రోజూ శోభన్ బాబు గదికి మాటలు చెప్పడానికి వెళుతోందట. రోజు అలా చేయడం బాగోదని గమనించిన శోభన్ బాబు ఆమెని అవాయిడ్ చేయడం కోసం క్యాంప్ ఫైర్ కి వచ్చేవారు అని జయకుమార్ అన్నారు. హీరోయిన్ల విషయంలో శోభన్ బాబు అంత నిగ్రహంతో ఉండేవారు. కానీ జయలలిత విషయంలో మాత్రం ఆయన ప్రేమలో పడకుండా ఉండలేకపోయారు అని జయకుమార్ అన్నారు.
జయలలిత, శోభన్ బాబు డాక్టర్ బాబు అనే చిత్రంలో నటించారు. ఆమె షూటింగ్ కి రావడమే ఒక మహారాణిలా వచ్చేవారు. ఆమె వెంట మరో రెండు కార్లు వచ్చేవి. ఒక కారులో ఆమె కూలర్, ఐస్ బాక్స్.. మరో కారులో మేకప్ సిబ్బంది వచ్చేవారు. జయలలిత రాగానే శోభన్ బాబు ఆమె పక్కనే కూర్చునేవారు. జయలలిత అందానికి శోభన్ బాబు.. శోభన్ బాబు స్టైల్ కి జయలలిత ఆకర్షితులై ప్రేమలో పడ్డట్లు తెలిపారు.