రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష.? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి.!
హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై త్రిష తల్లి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిషకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ‘వర్షం’ చిత్రంతో తన హవాను ప్రారంభించిన ఈ బ్యూటీ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.
బడా స్టార్స్ సరసన నటించిన త్రిష సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటవల సినిమాల జోరు తగ్గించిన ఈ బ్యూటీ పొలిటికల్ ఎంట్రీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
అయితే గత కొద్దిరోజులుగా నెట్టింట్లో మాత్రం త్రిష కృష్ణన్ రాజకీయాలకు తప్పకుండా ఎంట్రీ ఇవ్వబోతుందని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా త్రిష ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఆమె తల్లి ఉమా కృష్ణన్ (Uma Krishnan) మాత్రం ఇదే విషయంపై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చింది.
ఉమా కృష్ణన్ చేసిన కామెంట్స్ ప్రకారం.. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. ప్రస్తుతం త్రిష ఫోకస్ సినిమాలపైనే పెట్టిందని అన్నారు. ఆయా భాషల చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. మరోవైపు త్రిషకు కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని, నెట్టింట వస్తున్న రూమర్లపైనా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ థళపతి కూడా రాజకీయాల్లోకి వస్తున్నారనే నేపథ్యంలో.. ఇటు త్రిషను కూడా ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా నెట్టింట రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా త్రిష తల్లి కామెంట్స్ వీటన్నింటికి చెక్ పెట్టినట్టైంది.
ఇన్నాళ్లు సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో హీరోయిన్ గా నటిస్తోంది. మున్ముందు మరిన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించినుంది.