MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో నయనతారను క్రాస్ చేసిన త్రిష, నిజమేనా..?

ఆ విషయంలో నయనతారను క్రాస్ చేసిన త్రిష, నిజమేనా..?

హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది త్రిష. కెరీర్ అయిపోయిందిలే అనుకున్న టైమ్ లో ఉప్పెనలా దూసుకొచ్చింది బ్యూటీ. ఇక అవకాశాలు పెరుగుతుండటంతో. రేటు కూడా పెంచిందట బ్యూటీ. టాప్ లో ఉన్న నయనతారను క్రాస్ చేసిందట. 
 

Mahesh Jujjuri | Published : Nov 16 2023, 05:04 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Trisha

Trisha

సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా  తిరుగులేని ఇమేజ్ ను సాధించింది త్రిష. కెరీర్లో ఎన్నో  అప్ అండ్ డౌన్స్ చూసిన ఆమె.. త్రిష ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లుపైనే అయ్యింది. ఆమె తో వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఫెయిడ్ అవుట్ అయ్యి.. పక్కకువెళ్ళిపోయారు. కాని త్రిష మాత్రం స్టిల్ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. 
 

28
Trisha

Trisha

అంతే కాదు.. కొన్నాళ్ల పాటు వెండితెరకు కాస్త దూరంగా ఉన్న త్రిష.. ఇక హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టి..ఇతర పాత్రలవైపు మళ్లుతుంది అనుకున్నారంత.కాని 96 సినిమాతో మరోసారి హీరోయిన్ గా తన సత్తా చాటి ఇక పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలతో త్రిష ఇమేజ్ మరోసారి ఎక్కడికో వెళ్ళిపోయింది. 

38
Asianet Image

హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే క్యారెక్టర్ రోల్స్ వైపే చూస్తారు ఎవరైనా..? కాని 40 ఏళ్ళ వయస్సులో త్రిష తన గ్లామర్ తో.. నటనతో.. మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. చరిత్ర తిరగరాసింది. పొన్నియన్ సెల్వన్ లో..ఐశ్వర్యరాయ్ లాంటి వారు ఉన్నా.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది బ్యూటీ. 

48
Asianet Image

నాలుగుపదుల వయస్సులో కూడా  అందం రోజురోజుకు పెరిగిపోతుందేమో అన్నట్లుగా ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తో కలిసి లియోలో నటించింది. దాదాపు కొన్నేళ్ల తర్వాత ఆయనతో జత కట్టింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టుతోంది.

58
Actor Trisha on Wedding rumour report hrk

Actor Trisha on Wedding rumour report hrk

అయితే ఇప్పటికీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉందట. లియో సినిమాకు త్రిష 5  కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుసగా సెకండ్ ఇన్నింగ్స్లో నటించిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా ఒకేసారి పెంచేసిందంట. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన వరుస ఆఫర్లు వస్తున్నాయి ఆమెకు..దాంతో నెక్ట్స్ సినిమాలకు 12 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. 

68
Asianet Image

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్న సినిమాలో త్రిషన్ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమా కోసం  త్రిష భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. లియో సినిమా కోసం ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న త్రిష ఈ సినిమా కోసం 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. 

78
Asianet Image

సౌత్ ఇండస్ట్రీలో మాత్రం నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటుంది. బాలీవుడ్ కు వెళ్ళడంతో ఆమె తాజాగా ఈ మొత్తాన్ని డిమాండ్ చేస్తుంది. నయనతార రెమ్యూనరేషనే టూమచ్ అనుకుంటున్నారు మేకర్స్. అటువంటిది. నయననతారను బీట్ చేసి ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని  తెలిసి అంతా షాక్ అవుతున్నారు. 

88
Actress Trisha

Actress Trisha

అయితే ఆమె  రెమ్యూనరేషన్ గురించి అధికారికంగా ఎటువంటిప్రకటన రాలేదు.. కాని ఈన్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. అయితే ఇలా ఆమె నిజంగా రెమ్యూనరేషన్ పెంచితే.. అవకాశాలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు.  
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
త్రిష
 
Recommended Stories
Top Stories