త్రిష ఆస్తి అన్ని కోట్లా..? కాస్ట్లీ కార్లు, భారీ భవంతులు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న చెన్నై చిన్నది...?
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది త్రిష. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో పాటు.. భారీగా సంపాదన కూడా ఆర్జించిందట. ఇంతకీ ఆమె ఆస్తులు ఎన్నికోట్లు ఉంటాయి. ఆమె ప్రాపర్టీస్ గురించి మీకు తెలుసా..?
సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ను సాధించింది త్రిష. కెరీర్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన ఆమె.. త్రిష ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లుపైనే అయ్యింది. ఆమె తో వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఫెయిడ్ అవుట్ అయ్యి.. పక్కకువెళ్ళిపోయారు. కాని త్రిష మాత్రం స్టిల్ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అంతే కాదు.. కొన్నాళ్ల పాటు వెండితెరకు కాస్త దూరంగా ఉన్న త్రిష.. ఇక హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టి..ఇతర పాత్రలవైపు మళ్లుతుంది అనుకున్నారంత.
Actress Trisha Krishnan
కాని 96 సినిమాతో మరోసారి హీరోయిన్ గా తన సత్తా చాటి ఇక పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలతో త్రిష ఇమేజ్ మరోసారి ఎక్కడికో వెళ్ళిపోయింది. హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే క్యారెక్టర్ రోల్స్ వైపే చూస్తారు ఎవరైనా..? కాని 40 ఏళ్ళ వయస్సులో త్రిష తన గ్లామర్ తో.. నటనతో.. మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. చరిత్ర తిరగరాసింది. పొన్నియన్ సెల్వన్ లో..ఐశ్వర్యరాయ్ లాంటి వారు ఉన్నా.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది బ్యూటీ.
నాలుగుపదుల వయస్సులో కూడా అందం రోజురోజుకు పెరిగిపోతుందేమో అన్నట్లుగా ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తో కలిసి లియోలో నటించింది. దాదాపు కొన్నేళ్ల తర్వాత ఆయనతో జత కట్టింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టుతోంది.
అయితే ఇప్పటికీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉందట. లియో సినిమాకు త్రిష 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుసగా సెకండ్ ఇన్నింగ్స్లో నటించిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా ఒకేసారి పెంచేసిందంట. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన వరుస ఆఫర్లు వస్తున్నాయి ఆమెకు..దాంతో నెక్ట్స్ సినిమాలకు 10 కోట్ల వరకూ డిమాండ్ చేసే అవకాశం ఉందట త్రిష.
ప్రస్తుతం తమిళంలో అజిత్ జోడీగా నటుస్తోంది త్రిష. అటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తోంది. వాటికి కూడా కోటి వరకూ ఛార్చ్ చేస్తుందట. ఇక తెలుగులో కూడా బాలయ్య సినిమాలో నటించడానికి ఆమెకు ఆఫర్ వెళ్లిందని టాక్. అంతే కాదు చిరంజీవి నెక్ట్స్ మూవీలో కూడా త్రిషనే హీరోయిన్ అంటున్నారు.
అయితే 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష ఆస్తులు భారీగా సంపాదించిందట. సోషల్ మీడియా సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో చెన్నైలో 10 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉందట. ఇక హైదరాబాద్ లో కూడా త్రిషకు 6 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో కొన్నిప్లాట్స్ కూడా ఉన్నాయట త్రిషకు.
ఇక త్రిష కార్లు, కాస్ట్లీ వస్తువల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.. 80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, 75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్, 60 లక్షల రేంజ్ రోవర్ కార్లు త్రిష గ్యారేజ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా త్రిష ఇప్పటి వరకు 90 కోట్లపైగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కాని.. ఇన్నేళ్ళు హీరోయిన్ గా నటించిన తార.. ఈమాత్రం సంపాదించకుండా ఉంటుందా అంటున్నారునెటిజన్లు.