- Home
- Entertainment
- పెళ్లి, విడాకులపై హీరోయిన్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు, ఇంతకీ ఆమె పెళ్లి గురించి ఏమన్నదంటే..?
పెళ్లి, విడాకులపై హీరోయిన్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు, ఇంతకీ ఆమె పెళ్లి గురించి ఏమన్నదంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళి కాని బ్యాచిలర్ లేడీస్ చాలా మంది ఉన్నారు. అందులో కొంత మంది ఎంగేజ్మెంట్ వరకూ వెళ్ళి.. బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఆ లిస్ట్ లో త్రిష కూడా ఉంది. ఇంతకీ పెళ్లి గురించి త్రిష ఏమంటుంది..? ఎలాంటివాడు కావాలి అంటుంది..? రీసెంట్ గా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే..?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ పదేళ్లు ఒక ఊపు ఊపింది అందాల భామ త్రిష. ఇప్పటికీ అదే అందంతో దూసుకుపోతోంది బ్యూటీ. ఇక నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. ఆమె ఇంకా పెళ్ళి పీటలెక్కలేదు. చెన్నైకి చెందిన బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ అయినా.. ఆతరువాత బ్రేకప్ చెప్పేసింది. చాలా కాలంగా ఖాళీగానే ఉంటోంది.
Trisha
ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి వెండితెరపై మెరిసి అభిమానులను మురిపించింది త్రిష.. ఫ్యాన్స్ ను మెప్పించింది. మరోవైపు త్రిష పెళ్లిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
40 ఏళ్ళు వస్తున్నా తాను ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి ప్రత్యేక కారణమేమి లేదంటోంది త్రిష. అంతే కాదు అసలు పెళ్ళిఎందుకు చేసుకోలేదనే ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు తెలియదని కరాఖండీగా చెప్పేసింది త్రిష.
అంతే కాదు ఇంత వరకూ తన మనసుకు నచ్చిన వాడు దొరకలేదంటోంది చిన్నది. మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే ఇక జీవితాంతం హ్యాపీగా ఉండేలా లైఫ్ ను సెట్ చేసుకోవాలి అనుకుంటుంది త్రిష. అంతే కాని చీటికి మాటికి విడిపోవడం తనకు నచ్చదంటోంది.
అంతే కాదు తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి తనపై పూర్తి నమ్మకం ఉండాలంటోంది త్రిష. అతను తన జీవితాంతం తనకు తోడుగా ఉంటాడని అనిపించాలని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం తనకు నచ్చదని తెలిపింది. ఇక త్రిష అభిమానులంతా.. త్వరలో గుడ్ న్యూస్ చెపుతుందని ఎదురుచూస్తున్నారు.