MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా ? సిగ్గుతో కుంగిపోతున్నా.. క్షమించండి అంటూ రాజమౌళి తండ్రి కామెంట్స్

ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా ? సిగ్గుతో కుంగిపోతున్నా.. క్షమించండి అంటూ రాజమౌళి తండ్రి కామెంట్స్

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పూర్వీకుల గురించి చెబుతూ ఇలాంటి వంశంలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది అని అన్నారు. ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 19 2026, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రచయిత విజయేంద్ర ప్రసాద్
Image Credit : varanasi event

రచయిత విజయేంద్ర ప్రసాద్

పాన్ ఇండియా రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు. రాజమౌళి సినిమాలకు మాత్రమే కాకుండా అనేక సూపర్ హిట్ చిత్రాలకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, భజరంగీ భాయీజాన్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు కథలు అందించడంతో విజయేంద్ర ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంచలన వ్యాఖ్యలు
Image Credit : our own

సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆయన రాజమౌళి వారణాసి చిత్రానికి కథ అందిస్తున్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దళితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల పట్ల ఉన్న వివక్ష గురించి విజయేంద్ర ప్రసాద్ ఓపెన్ గా కామెంట్స్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

35
తన దళిత స్నేహితుడి గురించి చెబుతూ..
Image Credit : our own

తన దళిత స్నేహితుడి గురించి చెబుతూ..

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ డయాస్ ని ఓ విషయం మాట్లాడేందుకు వాడుకుంటున్నా. మాది చాలా సంపన్న కుటుంబం. నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్ పేరు జాన్ ఫెడిరిక్ సుందర్ రావు. దళిత కులానికి చెందిన అబ్బాయి. నాతో పాటు సమానంగా బాగా చదివేవాడు. మా నాన్న గారు ఆఅబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఎస్ఎస్సి తర్వాత ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. మా నాన్నకి కుల వివక్ష లేదు. నేను కూడా అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు.

45
ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా ?
Image Credit : our own

ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా ?

కానీ మా తాతలు, ముత్తాతలకు కుల వివక్ష ఉంది. వాళ్ళు నోటితో చెప్పలేని ఘోరాలు కుల వివక్ష రూపంలో చేశారు. ఆది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. ఛీ ఇలాంటి వంశంలో పుట్టానా అని అనిపించింది. కానీ ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది. మా పూర్వీకుల జీన్స్ నాకు ఉంది. వారి ఆస్తులు అనుభవిస్తున్నా.

55
క్షమించండి అని వేడుకుంటున్నా
Image Credit : facebook.com/SSRajamouli

క్షమించండి అని వేడుకుంటున్నా

అందుకే మీ అందరి ముందు తలవంచి వినయంగా క్షమించండి అని వేడుకుంటున్నా అంటూ విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. కుల వివక్ష గురించి విజయేంద్ర ప్రసాద్ ఇంత ఓపెన్ గా మాట్లాడడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
తెలుగు సినిమాకి చుక్కలు చూపించిన రైల్వే డిపార్ట్మెంట్, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ?
Recommended image2
OTT Movies: సమంత నుంచి చిరంజీవి కూతురు వరకు, ఇదెక్కడి ర్యాంపేజ్ బాబోయ్.. ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 మూవీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved