నా తండ్రి నన్ను చంపాలని చూస్తున్నాడు.. నటి సంచలన ఆరోపణలు
తన తండ్రి రామ్ రతన్ శంఖధర్ తనను చంపాడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది హీరోయిన్ త్రిపాఠి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న త్రిపాఠి శంఖధర్ తన తండ్రి మీద సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి రామ్ రతన్ శంఖధర్ తనను చంపాడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది త్రిపాఠి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
రతన్ తనకు ఇష్టం లేని అబ్బాయితో తన పెళ్లి చేయాలని చూస్తున్నాడని, ఆ పెళ్లికి నిరాకరించటంతో తన పైన దాడిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇన్నాళ్లు తన మీద ఖర్చు పెట్టిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలంటూ బెదిరిస్తున్నాడని చెప్పింది.
తన తల్లితో కలిసి తనను రక్షించాలంటూ త్రిపాఠి రిలీజ్ చేసిన వీడియో వైరల్ కావటంతో పోలీసులు స్పందించారు. త్రిపాటి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయితే సోషల్ మీడియా పోస్ట్‌పై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఆమె ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అయితే ఆరోపణలను రామ్ రతన్ ఖండించారు. ఇక హీరోయిన్ త్రిపాఠి శంకధర్ టిక్ టాక్ స్టార్ కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓయ్ ఇడియట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.