MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?

మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?

దాదాపు పదేళ్లుగా గ్లోబల్ బాక్సాఫీస్‌ను అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఏలుతోంది. అయితే, 2026-27 మధ్య రాబోతున్న మూడు భారీ ఇండియాన్ మూవీస్  ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 11 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దంగల్ అసాధారణ విజయం
Image Credit : india tv

దంగల్ అసాధారణ విజయం

ఇండియాతో పాటు  చైనా, హాంగ్‌కాంగ్‌లో 'దంగల్' అసాధారణ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒక్క చైనా మార్కెట్ నుంచే దాదాపు రూ.1305 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సుమారు రూ.2070 కోట్లకు చేరాయి. ఇండియాలో ఈ చిత్రం దాదాపు రూ.387 కోట్లు సంపాదించింది. 'బాహుబలి 2', 'పుష్ప 2' వంటి బ్లాక్‌బస్టర్లు ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా, దాన్ని దాటలేకపోయాయి. దీంతో దాదాపు తొమ్మిదేళ్లుగా 'దంగల్' రికార్డు పదిలంగా ఉంది.

23
వారణాసితో రెడీ అవుతున్న రాజమౌళి..
Image Credit : varanasi movie

వారణాసితో రెడీ అవుతున్న రాజమౌళి..

'బాహుబలి', 'RRR' వంటి గ్లోబల్ హిట్స్ ఇచ్చిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం 'వారణాసి' సినిమాపై పనిచేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 2027లో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈసినిమా టార్గెట్ 3000 కోట్ల వరకూ ఉండే అవకాశం కనిపిస్తోంది. 

దీనితో పాటు ధురంధర్ 2 , రామాయణ్ కలిసి.. రాబోయే 16 నెలల్లో ఈ మూడు సినిమాల్లో ఏదో ఒకటి 'దంగల్' లైఫ్‌టైమ్ గ్లోబల్ వసూళ్లను దాటేయగలదని ట్రేడ్ అనలిస్ట్ వరుణ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. ఇది భారత సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చు.

Related Articles

Related image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
33
బాలీవుడ్ మూవీస్ సాధించగలవా?
Image Credit : Instagram

బాలీవుడ్ మూవీస్ సాధించగలవా?

ఆదిత్య ధర్ తీస్తున్న 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సీక్వెల్ మార్చి 2026లో విడుదల కానుంది. 

మరోవైపు, నితేష్ తివారీ 'రామాయణ పార్ట్ వన్' పైనా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సన్నీ డియోల్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న ఈ మైథలాజికల్ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో రానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
సాయి పల్లవి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Recommended image2
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image3
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Related Stories
Recommended image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved