లైవ్ లో తమన్నా రచ్చ రంబోలా... కావాలయ్యా సాంగ్ కి రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. లైవ్ పెర్ఫార్మన్స్ తో తమన్నా అదరగొట్టింది.

Tamannah Bhatia
జైలర్ ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం సాయంత్రం చెన్నై వేదికగా ఘనంగా నిర్వహించారు. హీరో రజినీకాంత్ తో పాటు కోలీవుడ్ ప్రముఖులు, జైలర్ చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవల బాగా ట్రెండ్ అయిన జైలర్ సాంగ్ కి తమన్నా లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. తమన్నా స్టెప్స్ ఆడియన్స్ లో జోష్ నింపింది.
Tamannah Bhatia
కాగా కెరీర్లో ఫస్ట్ టైం తమన్నా రజనీకాంత్ పక్కన నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఆగస్టు 10న జైలర్ విడుదల కానుంది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tamannah Bhatia
రజినీకాంత్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అన్నాత్తే తమిళంలో పర్లేదు అనిపించింది. తెలుగులో ఆడలేదు. మరి జైలర్ తో అయినా రజినీకాంత్ కమ్ బ్యాక్ అవుతారేమో చూడాలి.
Tamannah Bhatia
అయితే జైలర్, భోళా శంకర్ ఒక రోజు వ్యవధిలో థియేటర్స్ లో దిగుతున్నాయి. ఆగస్టు 11 భోళా శంకర్ విడుదల తేదీగా ప్రకటించారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. జైలర్, భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.
Tamannah Bhatia
భోళా శంకర్ లో కూడా తమన్నానే హీరోయిన్ కావడం విశేషం. అంతకు ముందు సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవి జతకట్టారు. భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు కాగా కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు.
Tamannah Bhatia
ఇక దాదాపు రెండు దశాబ్దాలుగా తమన్నా ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.
Tamannah Bhatia
తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు.