- Home
- Entertainment
- Taapsee Pannu: బోల్డ్ షోలో నెక్స్ట్ లెవెల్ ... తాప్సి తెగింపు చూస్తే మెంటలెక్కడం ఖాయం!
Taapsee Pannu: బోల్డ్ షోలో నెక్స్ట్ లెవెల్ ... తాప్సి తెగింపు చూస్తే మెంటలెక్కడం ఖాయం!
బాలీవుడ్ కి వలసెల్లిన తాప్సి తన గ్లామర్ పవర్ పరిచయం చేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించేలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాప్సి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Taapsee Pannu
బ్లాక్ కలర్ ట్రెండీ వేర్లో తాప్సి సూపర్ హాట్ ఫోజులతో చంపేశారు. హాలీవుడ్ భామలు మించిపోయేలా క్రేజీ అవుట్ ఫిట్ ట్రై చేశారు. తాప్సి అందాలకు కుర్రాళ్ళు కుదేలవుతున్నారు. కామెంట్స్ రూపంలో ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.
Taapsee Pannu
కాగా వరుస చిత్రాలతో తాప్సి హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్ లో అధికంగా చిత్రాలు చేస్తున్న అమ్మడు, తెలుగు తమిళ భాషల్లో కూడా అడపాదడపా ఒప్పుకుంటున్నారు. గత ఏడాది అరడజను చిత్రాల వరకూ ఆమె రిలీజ్ చేశారు.
Taapsee Pannu
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సి టైటిల్ రోల్ చేశారు. ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సి చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు.
Taapsee Pannu
ప్రస్తుతం తాప్సి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా తాప్సి కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సి హీరోయిన్ అయ్యారు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు
Taapsee Pannu
ఇక తమిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సి నటిస్తున్నారు. ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి.ఓ లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు.
Taapsee Pannu
కాగా తాప్సికి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ దిశగా అడుగలు వేయడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తుంది. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందనుకుంటే తాప్సి తన టాలెంట్, హార్డ్ వర్కింగ్ నేచర్ తో పుంజుకుంది. అనూహ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది.
Taapsee Pannu
బాలీవుడ్ కి వలసెల్లిన తాప్సి తన గ్లామర్ పవర్ పరిచయం చేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించేలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాప్సి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.