- Home
- Entertainment
- Sreeleela : మహేష్, నితిన్, రామ్, వైష్ణవ్ చిత్రాల ఎఫెక్ట్ పడిందా, లేక అదే నిజామా.. శ్రీలీల సినిమాలకు బ్రేక్ ?
Sreeleela : మహేష్, నితిన్, రామ్, వైష్ణవ్ చిత్రాల ఎఫెక్ట్ పడిందా, లేక అదే నిజామా.. శ్రీలీల సినిమాలకు బ్రేక్ ?
శ్రీలీల రామ్ సరసన స్కంద చిత్రంలో, వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ, నితిన్ సరసన ఎక్స్ట్రా, మహేష్ బాబుకి జోడిగా గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటీ విజయం సాధించలేదు.

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.
ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.
ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. అయితే శ్రీలీల క్రేజ్ కి తగ్గట్లుగా ఆఫర్స్ వచ్చాయి కానీ విజయాలు మాత్రం దక్కలేదు. ఆమె సక్సెస్ రేట్ అంతంత మాత్రమే. ఆమె హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ అయిన చిత్రం అంటే ధమాకా మాత్రమే.
బాలయ్య భగవంత్ కేసరి చిత్రం హిట్ అయింది. కానీ అందులో శ్రీలీల బాలయ్యకి కుమార్తెగా నటించింది. ఇక శ్రీలీల రామ్ సరసన స్కంద చిత్రంలో, వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ, నితిన్ సరసన ఎక్స్ట్రా, మహేష్ బాబుకి జోడిగా గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటీ విజయం సాధించలేదు. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.
ఈ చిత్రాల ప్రభావమో లేక ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసపెట్టి ఫ్లాపులు పడడంతో శ్రీలీలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ సైతం వినిపించాయి. ప్రస్తుతం శ్రీలీల ఎలాంటి చిత్రానికి సైన్ చేయడం లేదు అని అంటున్నారు.
కొందరు ఫ్లాప్ చిత్రాల ఎఫెక్ట్ అని అంటుంటే.. అసలు నిజం అది కాదని.. ఆమె మెడిసిన్ కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రీలీల కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉంది. అయితే ఆ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి.