MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తల్లికిచ్చిన మాట కోసం శ్రీలీల సంచలన నిర్ణయం, ఇక నుంచి కండీషన్స్ అప్లై అంటోన్న బ్యూటీ

తల్లికిచ్చిన మాట కోసం శ్రీలీల సంచలన నిర్ణయం, ఇక నుంచి కండీషన్స్ అప్లై అంటోన్న బ్యూటీ

యంగ్ హీరోయిన్ శ్రీలీల సంచలన నిర్ణయం తీసుకుందట. అది కూడా తన తల్లికి ఇచ్చిన మాట మేరకు ఈ నిర్ణయం తీసుకుందంట. ఇక నుంచి సినిమాలకు శ్రీలీల కొన్ని కండీషన్లు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 03 2023, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో లేదో.. అలా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది శ్రీలీల. చేసిన మొదటి సినిమా పెళ్లి సందడి డిజాస్టర్ గా నిలిచినా.. ఈమూవీలో ఆమె పెర్ఫామెన్స్ కు 100 మార్కులు పడ్డాయి. దాంతో శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చియి. దాంతో సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది బ్యూటీ. 
 

26
Sreeleela

Sreeleela

అటు మేకర్స్ కూడా శ్రీలీల డేట్స్ కోసం తెగ పోటీపడుతున్నారు.  దాంతో ఆమె ఖాతాలో దాదాపు 5సినిమాలకు పైగా ఉన్నాయి. చాలా  తక్కువ టైమ్ లోనే  స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిపోయింది శ్రీలీల. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.  ఇండస్ట్రీలోని టాప్‌ హీరోల సరసన నటిస్తోంది బ్యయూటీ. అంతే కాదు  హై ఎనర్జీతో పోటాపోటీగా నటించడం.. డాన్స్ చేయడం శ్రీలీల స్పెషల్. 

36

ఈ యంగ్ బ్యూటీ.. తాజాగా.. సీనియర్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ సరసన ఆయన.. ఎనర్జీతో పోటీపడి మరీ నటించింది. స్టెప్పులేసింది. ఈసినిమా సూపర సక్సెస్ అవ్వడంతో.. శ్రీలీల బాగా బిజీ అయిపోయింది. అటు బాలయ్య బాబు మేనకోడలిగా కూడా నటిస్తోంది. శ్రీలీల ఖాతాలో ఉన్న నాలుగైదు సినిమాలు సూపర్ ఫాస్ట్ గా  షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. 

46

ఇక ఈ నేపథ్యంలోనే శ్రీలీలకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన  తల్లికి ఇచ్చిన మాటకు సంబంధించి ఓ విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. సినిమాల విషయంలో శ్రీలీల తన తల్లికి ఓ మాట ఇచ్చారట. శ్రీలీల తన సినిమాల్లో ఎలాంటి రొమాంటిక్‌ సీన్స్.. లిప్ లాక్ సీన్స్ చేయనని మాట ఇచ్చిందట.  
 

56

అంతే కాదు గతంలో శ్రీలీల అలాంటి సీన్స్ చేసినప్పుడు వచ్చిన ట్రోల్స్ చూసి.. తన బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిందట శ్రీలీల తల్లి. దాంతో  కిస్ సీన్స్.. బెడ్  సీన్లలో నటించనని తల్లికి మాటిచిందట. చిన్న వయసులోనే ఇలా ట్రోలింగ్స్‌ మొదలైతే.. భవిష్యత్తులో అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆమె భావించారట.

66

దాంతో శ్రీలీలా సినిమాల కోసం తన దగ్గరకు వచ్చే మేకర్స్ కు ఈ కండీషన్ అప్లై చేస్తోందని సమాచారం. అంతే కాదు. ఈ ప్రభావంతో.. ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోవలసి వచ్చిందనిసమాచారం.మరి ఈ వార్త నిజం అయితే..ఫ్యూచర్ ల్ శ్రీలీల ఎంలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
Recommended image2
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Recommended image3
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved