- Home
- Entertainment
- ఫ్యాన్స్ కు సారీ చెప్పిన హీరోయిన్ శ్రీలీల.. ప్రకృతి అందాల నడుమ సందడి చేసిన యంగ్ బ్యూటీ..
ఫ్యాన్స్ కు సారీ చెప్పిన హీరోయిన్ శ్రీలీల.. ప్రకృతి అందాల నడుమ సందడి చేసిన యంగ్ బ్యూటీ..
వరుస సినిమాలతో సందడి చేస్తుంది చేస్తుంది శ్రీలీల. స్టార్ హీరోలు కూడా ఆమెకోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో శ్రీలీల తన ఫ్యాన్స్ కు సారీ చెప్పింది. సోషల్ మీడియాలో పలు ఫోటోలు పోస్ట్ చేసిన బ్యూటీ.. వాటితో పాటు సారీ కూడాచెప్పింది. ఏందుకుంటే..?

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిందిపోయింది హీరోయిన్ శ్రీలీల. సినిమా ప్లాప్ అయినా.. ఆమెకు మాత్రం ఇమేజ్ భారీ స్థాయిలో వచ్చి పడింది. దానితో పాటుగా అవకాశాలు కూడా అంతే రేంజ్ లో వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది శ్రీలీల. రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియా పేజ్ లో పెట్టడం శ్రీలీలకు బాగా అలవాటు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఈమె షూటింగ్ నిమిత్తం ఓ చిన్న పల్లెటూరులో సందడి చేసింది. ఈ షూటింగ్ దేనికోసం అనేది తెలియదు కాని.. అక్కడ ఉన్న నేచర్ లో సరదాగా ఆడుకుంటూ గడిపేసింది బ్యూటీ.
దేవుడి కోవెల గంటలు కొట్టడం, అక్కడ ఉన్న లేగదూడకు గడ్డి తినిపించడం.. అక్కడి పూలతోటలో ఆడుకోవడం లాంటివి తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోస్ ను తన ఇన్ స్టాలో శేర్ చేసుకుంది శ్రీలీల. అయితే ఆ ఫోటోలు మాత్రం పెద్దగా క్వాలిటీ లేకుండా.. క్లారిటీ లేకుండా వచ్చాయి దాంతో తన పోస్ట్ లో ఈ విషయాన్ని కూడా వెల్లడించింది.
తను సరదాగా ఆటలాడుతూ.. షూటింగ్ బ్రేక్ లోగడిపిన ఫోటోస్ ను శేర్ చేస్తున్నట్టు తెలిపిన ఆమె.. ఈ ఫోటోస్ క్వాలిటీ లేవు. అందుకు మీకు సారి చెపుతున్నా అంటూ వెల్లడించింది. దాంతో ఈ అమ్మడు పోస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వరుసగా కామెంట్లు కూడా పెడుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా మారిపోయింది శ్రీలీల. తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకుంది. మాస్ మహారాజ్ కు పోటీగా అదరిపోయే స్టెప్పులేసింది బ్యూటీ. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాను ఏమాత్రం నెగ్లెట్ చేయకుండా .. యాక్టీవ్ గా ఉంటోంది.
పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా మారింది శ్రీలీలా.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. కాని ఈసినిమా హిట్ అవ్వలేదు. శ్రీలీల గ్లామర్ కు.. ఆమె పెర్ఫామెన్స్ కు మంచి పేరు వచ్చింది. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా తెలుగులో వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయింది బ్యూటీ. స్టార్ హీరోయిన్లకు ఇప్పటికే పోటీ వచ్చేస్తోంది శ్రీలీల.