- Home
- Entertainment
- కసి కళ్లతో కుర్రాళ్లను కవ్విస్తున్న చైతు రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్... పలుచని డ్రెస్ లో పరువాల విందు!
కసి కళ్లతో కుర్రాళ్లను కవ్విస్తున్న చైతు రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్... పలుచని డ్రెస్ లో పరువాల విందు!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. అమ్మడు కసి కళ్లతో కుర్రాళ్లను కవ్వించింది. పలుచని డ్రెస్ లో పరువాల విందు చేసింది. శోభిత లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Sobhita Dhulipala
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో పుట్టిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించారు. గూఢచారి సూపర్ హిట్ కొట్టింది. అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం మేజర్ లో మరో ఛాన్స్ ఇచ్చారు. బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ విజయం సాధించింది.
Sobhita Dhulipala
శోభిత పలు భాషల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ అయ్యారు. అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. అయితే శోభిత కెరీర్ బిగినింగ్ అనేక అవమానాలు ఎదుర్కొన్నారట. ఓ సందర్భంలో ఒకప్పటి తన చేదు అనుభవాలు అభిమానులతో పంచుకుంది.
Sobhita Dhulipala
ఓ షాంపూ యాడ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను కూడా హాజరయ్యాను. నన్ను చూసి... నువ్వు కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు. నువ్వు అందంగా లేవు అన్నారు. అవును నేను అందంగా లేనని చెప్పి అక్కడ నుండి వచ్చేశాను. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు. కొన్నేళ్ల తర్వాత అదే షాంపూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేశానంటూ శోభిత చెప్పుకొచ్చారు.
Sobhita Dhulipala
కొద్దిరోజులుగా శోభిత పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె నాగ చైతన్య ప్రేయసిగా ప్రచారం కావడమే. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారట. సన్నిహితంగా ఉంటూ టూర్స్, వెకేషన్స్ కి వెళుతున్నారట. డేటింగ్ చేస్తున్నారని గట్టిగా వినిపిస్తోంది.
Sobhita Dhulipala
ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అని స్పష్టత ఇచ్చారు. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె అంతా ట్రాష్ అంటూ కొట్టిపడేశారు.
Sobhita Dhulipala
ఇటీవల శోభిత-నాగ చైతన్య కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. లండన్ రెస్టారెంట్ లో ఓ ఇండియన్ చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగారు. అనుకోకుండా ఆ ఫొటోలో శోభిత ధూళిపాళ్ల కవర్ అయ్యారు. దీంతో వీరి ఎఫైర్ పై మరింత స్పష్టత వచ్చింది. అయితే మేము ప్రేమలో ఉన్నామని ఇద్దరూ ఓపెన్ కావడం లేదు.
Sobhita Dhulipala
కాగా శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. మణిరత్నం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2 చిత్రాల్లో కీలక రోల్ చేశారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీతో పాటు మంకీ మాన్ టైటిల్ తో ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.
Sobhita Dhulipala
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. అమ్మడు కసి కళ్లతో కుర్రాళ్లను కవ్వించింది. పలుచని డ్రెస్ లో పరువాల విందు చేసింది. శోభిత లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.