MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆరోగ్యం బాగోలేదు, అయినా సరే పోరాడుతున్నా... శృతి హాసన్ సెన్సేషనల్ కామెంట్స్..ఇంతకీ ఆమెకు ఏమయ్యింది..?

ఆరోగ్యం బాగోలేదు, అయినా సరే పోరాడుతున్నా... శృతి హాసన్ సెన్సేషనల్ కామెంట్స్..ఇంతకీ ఆమెకు ఏమయ్యింది..?

ఎంత డబ్బు ఉన్నా.. ఎంత స్టార్ డమ్ ఉన్నా.. మనశాంతి లేకుంటే ఇవన్నీ వేస్ట్. ముఖ్యంగా సినిమావాళ్ల జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కోట్లు సంపాధించినా.. అనారోగ్య సమస్యలతో ఇబ్బంద పడుతుంటారు. ప్రస్తుతం శృతి హాసన్ అలాంటి ప్రాబ్లమ్ నే ఫేస్ చేస్తోందట.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 01 2022, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరోయిన్ల జీవితాలు చాలా అందంగా కనిపిస్తాయి.. కాని ఆ అందం వెనకు ఎన్నోబాధలు, మరెన్నో ఇబ్బందులు, హీరోయిన్లు ఆర్ధికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉండవచ్చు.. కొంత మంది ఆర్ధికంగా కూడా బలంగా లేకపోవచ్చు.. కాని వారికి ఇంకా ఏ  సమస్యలు ఉండవనుకోవడం పిచ్చితనమే అవుతుంది. సెలెబ్రిటీలను కూడా కొన్ని సమస్యలు పట్టి పీడిస్తుంటాయి..ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో చాలా మంది స్టార్స్ సతమతం అవుతుంటారు. ఆలిస్ట్ లో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఉంది. 

27

సెలబ్రిటీలు కూడా  సాధారణ మనుషులే, వారికీ ఎన్నో ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. బాలీవుడ్ స్టార్స్ దీపిక పడుకోనే, సారా అలీఖాన్ లాంటి వారు  డిప్రెషన్ బారిన పడిన సంగతి తెలిసిందే, సల్మాన్ ఖాన్ కండరాల సమస్యతో బాధపడుతున్నారు. ఇలానే సౌత్ స్టార్ హీరోయిన్  శ్రుతి హాసన్ కూడా తనను వేధిస్తున్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తన సమస్యను వివరించింది. 
 

37

ఇన్ స్టాలో యోగా వీడియోను పోస్ట్ చేసిన శ్రుతి చాలా పెద్ద నోట్ రాసింది. శారీరకంగా నీరసంగా ఉన్నాను, కానీ మానసికంగా మాత్రం దృఢంగా ఉన్నాను అని రాసుకొచ్చింది. తాను కొన్ని చెడు హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది. వాటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నట్టు శ్రుతి హాసన్ తెలిపింది . 
 

47

హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య నుంచి బయటపడేందుకు సమయానికి తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం చేస్తున్నట్టు రాసుకొచ్చింది. మానసికంగా తాను చాలా స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్యలు జీవితానికి విసిరే సవాళ్లని, వాటిని తీసుకోవాలని ధైర్యంగా పేర్కొంది. ఇలాంటి సమస్యు మహిళలకు రావడం సహజమని, వాటిని బయటకు చెప్పేందుకు అస్సలు మోహమాటపడొదంటోంది.  
 

57

ప్రస్తుతం శృతీ హాసన్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తమిళ స్టార్ హీరో  కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి హాసన్. తన సొంత టాలెంట్ తోనే హీరోయిన్ గా ఎదిగింది. తన నటన, అందంతో అవకాశాలు అందిపుచ్చుకుంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తో క్రేజీ హీరోయిన్ గా మారింది.

67

అంతకుముందు ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న శృతీ హాసన్ ను.... గబ్బర్ సింగ్ సినిమాతో లక్కీ హీరోయిన్ గామార్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమా  హిట్ తరువాత వరుసపెట్టి సినిమాలు చేసింది. మధ్యలో గ్యాపిచ్చిన శ్రుతి రవితేజతో కలిసి క్రాక్ సినిమాతో తిరిగి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

77

ఇటు సీనియర్ హీరోలతో కూడా ఆమె నటిస్తోంది. మెగాస్టార్  సరసన 154 సినిమాలో ఆమె నటిస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమాతో పాటు బాలయ్య బాబు మలినేని గోపీచంద్ మూవీలో కూడా శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు సీనియర్ హీరోలను కూడా కవర్ చేస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు
Recommended image2
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌, భారీ ఈవెంట్‌లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్‌ ఫిదా
Recommended image3
Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved