పబ్లిక్ లో కాలు పైకెత్తి ఆ పోజులేంటి శ్రియా... లోదుస్తులు కూడా కనిపించేలా, దారుణం!
విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోమ్ నగరంలోని ప్రఖ్యాత కొలోజియం ఎదుట క్రేజీ పోజులతో శ్రియ మనసులు దోచేశారు.

Shriya Saran
హీరోయిన్ శ్రియ శరన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. అటు ప్రొఫెషన్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఆమె రోమ్ నగరంలో ఉన్నారు. కొలోజియం దగ్గర ఫోటో షూట్ చేశారు.
Shriya Saran
ఇక శ్రియ పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. టాలీవుడ్ ఆమెను స్టార్ చేసింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ శరన్ నటి కావాలని కలలు కన్నారు. అందుకు డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట.
Shriya Saran
2001లో ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ నటించారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు.
Shriya Saran
దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.
Shriya Saran
2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికి శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ అనంతరం తెలియజేసింది.
Shriya Saran
ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.
Shriya Saran
మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా శ్రియ నాజూకు సౌందర్యం కలిగి ఉన్నారు. తాజాగా కోట్ అండ్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా మెస్మరైజ్ చేశారు. శ్రియ అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.