- Home
- Entertainment
- ప్రభాస్ చేసిన ఆ పని ఇంకా మర్చిపోని హీరోయిన్... మళ్ళీ జతకట్టాలంటే కండిషన్స్ ఇవే అంటూ కామెంట్స్!
ప్రభాస్ చేసిన ఆ పని ఇంకా మర్చిపోని హీరోయిన్... మళ్ళీ జతకట్టాలంటే కండిషన్స్ ఇవే అంటూ కామెంట్స్!
ప్రభాస్ తో కలిసి మరలా నటించాలంటే నా కండిషన్ ఇదే అంటుంది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. గతంలో ఆయన చేసిన ఓ పని మర్చిపోలేని హీరోయిన్ ఈ తరహా కామెంట్స్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఒక వర్గం ప్రేక్షకులకు సాహో నచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేశాయి.
అందుకే సాహో బాలీవుడ్ లో సూపర్ హిట్. అక్కడ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాహో రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా నటించింది శ్రద్ధా కపూర్. ఆమెకు ఇది ఫస్ట్ తెలుగు మూవీ. హీరో ప్రభాస్ ని వెంటాడే పోలీస్ అధికారి పాత్ర చేసింది. తనదైన నటనతో ఆకట్టుకుంది.
సాహో అనంతరం శ్రద్దా కపూర్ కి తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అనుకుంటే అలా జరగలేదు. సాహో ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో దర్శక నిర్మాతలు ఆమె పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కూడా ఒక కారణం అని సమాచారం.
Prabhas
శ్రద్ధా కపూర్ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. తాజాగా ఆమె ఓ ఆన్లైన్ చాట్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ అభిమాని మీరు మరలా ఎప్పుడు ప్రభాస్ తో కలిసి నటిస్తారని? అడిగాడు. దానికి కొంటె సమాధానం ఇచ్చింది శ్రద్ధా కపూర్. ప్రభాస్ మరలా ఎప్పుడైతే తన ఇంటిని నుండి నాకు భోజనం పంపుతారో... అప్పుడు మాత్రమే ఆయనతో తిరిగి నటిస్తాను... అని ఆమె అన్నారు.
Prabhas
ఈ క్రమంలో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం శ్రద్ధా కపూర్ ఇంకా మరచిపోలేదనే వాదన మొదలైంది. ప్రభాస్ ఒక సాంప్రదాయం ఫాలో అవుతాడు. తనతో కలిసి నటించే హీరోయిన్స్ కి అరుదైన, అద్భుతమైన వంటకాలతో విందు ఏర్పాటు చేస్తాడు. సాహో షూటింగ్ సమయంలో శ్రద్ధా కపూర్ ని మంచి విందు భోజనంతో ఫిదా చేశాడు.
అప్పటి ప్రభాస్ ట్రీట్ ని శ్రద్ధా కపూర్ ఇంకా మర్చిపోలేదని ఆమె రీసెంట్ కామెంట్ ద్వారా అర్థం అవుతుంది. ప్రభాస్-శ్రద్ధా కపూర్ ఫెయిర్ ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఫ్యాన్స్ చూడాలి అనుకుంటున్నారు. అయితే వాళ్ళ కోరిక నెరవేరడం అంత సులభం కాదు. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ మూవీలో అయినా శ్రద్ధా కపూర్ కి ఛాన్స్ వస్తుందేమో చూడాలి...