అప్పుడే శ్రియ కూతురు ఇంత పని చేసిందా... అమ్మ చెప్పినా వినడం లేదుగా?
హీరోయిన్ శ్రియ శరన్ కూతురు రాధ స్కూల్ కి వెళుతుందట ఫస్ట్ డే కూతురిని స్కూల్ లో చేర్చిన విషయాన్ని శ్రియ అభిమానులతో పంచుకుంది.

Shriya Saran
పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్ కి పంపడం ఎమోషనల్ మూమెంట్. ఆ క్షణాన్ని హీరోయిన్ శ్రీయ సైతం అనుభవిస్తున్నారు. కూతురు రాధను స్కూల్ లో అడ్మిట్ చేశారు. శ్రియ భర్తతో కలిసి స్కూల్ కి వెళ్లారు. ఇక రాధ స్కూల్ అయిపోయాక కూడా ఇంటికి రావడం లేదట. స్కూల్ ఆవరణలో ఉన్న ప్లే జోన్ లో ఆటల్లో మునిగిపోయింది.
Shriya Saran
శ్రియ కూతురిని ఇంటికి వెళదామని ఎంత బ్రతిమిలాడినా రావడం లేదు. అందరూ వెళ్లిపోయారు. మనం మాత్రమే ఉన్నాం, ఇంటికి వెళదాం అంటూ శ్రియ కూతురు రాధను బ్రతిమిలాడుతుంది. శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కూతురు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ని అభిమానులతో శ్రియ పంచుకున్నారు.
Shriya Saran
కాగా శ్రియ ప్రెగ్నెన్సీ విషయం దాచారు. కెరీర్ కొంచెం నెమ్మదించాక 2018లో రష్యాకు చెందిన ఆండ్రీని శ్రియ పెళ్లి చేసుకున్నారు. సడన్ గా తనకు కూతురు ఉన్నట్లు చెప్పి బాంబు పేల్చింది. శ్రియ అసలు గర్భవతి ఎప్పుడయ్యారని ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.
Shriya Saran
2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని ఆమె 10 నెలల తర్వాత 2021 అక్టోబర్ లో తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భం దాల్చారు. 2020లో ఏడాది పాటు పూర్తిగా లాక్ డౌన్ నడిచింది. షూటింగ్స్, మీటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్రొఫెషన్ కి కూడా బ్రేక్ వచ్చిన నేపథ్యంలో శ్రియ తన ప్రెగ్నెన్సీ రివీల్ చేయలేదు. రహస్యంగా బిడ్డను కన్నారు.పెళ్లైన శ్రియ గర్భవతి అయిన విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చిందని అభిమానులు మదన పడ్డారు.
Shriya Saran
శ్రియ దీనికి ఊహించని సమాధానం చెప్పారు. గర్భం దాల్చడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు కావచ్చు. బరువు పెరగడం అనేది సామాన్యులకు చిన్న విషయమే. కానీ సెలబ్రిటీల విషయంలో దాన్ని భిన్నంగా చూస్తారు. ప్రెగ్నెన్సీ, డెలివరీ కారణంగా నేను లావైతే బాడీ షేమింగ్ కి గురి కావచ్చు. అవన్నీ మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి.
Shriya Saran
బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ కి భయపడి నేను ప్రెగ్నెన్సీ విషయం బయటకు చెప్పలేదు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను.. అంటూ శ్రియ వివరణ ఇచ్చారు. కాగా రెండు తరాల సూపర్ స్టార్స్ తో నటించిన ఘనత శ్రియ సొంతం. ప్రస్తుతం తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియ నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు. దృశ్యం 2 (హిందీ) లో మరోసారి జతకట్టారు.