- Home
- Entertainment
- మరో సావిత్రిలా నా జీవితం కాకూడదనే అతన్ని వదిలేశాను... సంచలనం రేపిన సమంత ఓపెన్ కామెంట్స్!
మరో సావిత్రిలా నా జీవితం కాకూడదనే అతన్ని వదిలేశాను... సంచలనం రేపిన సమంత ఓపెన్ కామెంట్స్!
ప్రేమలో నేను మోసపోయాను. అతన్ని వదిలించుకుని మంచి పని చేశాను. లేదంటే నా జీవితం మరో సావిత్రిలా దుర్భరంగా మారేదని కామెంట్స్ చేసింది సమంత. ఈ మాటల వెనుక నేపథ్యం పరిశీలిస్తే..

సమంత సక్సెస్ ఫుల్ కెరీర్ అనుభవించింది. దాదాపు 14 ఏళ్ల సినీ జర్నీలో సమంత హైట్స్ చూసింది. సౌత్ ఇండియాలో స్టార్ లేడీగా వెలుగొందింది. 2010లో విడుదలైన ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మొదటి చిత్రమే సూపర్ హిట్. బృందావనం, దూకుడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసింది.
సమంతకు సక్సెస్ రేట్ ఎక్కువ. అందుకే ఆమె లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కానీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో సమంత - నాగ చైతన్యల వివాహం జరిగింది.
నాలుగేళ్లు సమంత వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. 2021లో మనస్పర్థలతో విడిపోయారు. విడాకులకు కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత విమర్శలు ఎదుర్కొంది. ఆమె టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం సమంత సింగిల్. పూర్తిగా కెరీర్ మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతుంది. కాగా గతంలో సమంత తన బ్రేకప్ లవ్ స్టోరీ మీద ఓపెన్ అయ్యారు.
సమంత మాట్లాడుతూ... ప్రేమలో నేను కూడా మోసపోయాను. అయితే తృటిలో తప్పించుకున్నాడు. లేదంటే నా జీవితం కూడా సావిత్రిలా అయ్యేది. సావిత్రి జీవితం మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే మహానటి మూవీ వలన నాకు ఆమెకు సంబంధించిన అనేక విషయాలు తెలిసి వచ్చాయి.
సావిత్రి హీరో జెమినీ గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన మరొక మహిళతో సంబంధం పెట్టుకుని సావిత్రిని మోసం చేశాడు. అది తెలిసిన సావిత్రి మానసిక క్షోభతో జీవచ్ఛవంలా బ్రతికింది. అతన్ని వదిలించుకోకపోతే నేను మరో సావిత్రిని అయ్యేదాన్ని.. అన్నారు. ఈ కామెంట్స్ సమంత ఎవరిని ఉద్దేశించి చేసిందనే చర్చ అప్పుడు జరిగింది.
టాలీవుడ్ వర్గాల ప్రకారం హీరో సిద్దార్థ్ ని ఉద్దేశించి సమంత ఈ కామెంట్స్ చేసిందట. 2013లో సమంత-సిద్ధార్థ్ జంటగా జబర్దస్త్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్టర్. జబర్దస్త్ మూవీ సెట్స్ లో సమంత-సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారనే వాదన ఉంది. అయితే సిద్ధార్థ్ క్యారెక్టర్ మంచిది కాదని సమంత సన్నిహితులు హెచ్చరించారట.
సిద్ధార్థ్ నేచర్ అర్థం చేసుకున్న సమంత అతనికి బ్రేకప్ చెప్పిందనే ఊహాగానాలు ఉన్నాయి. అనంతరం సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే ఓ మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాత కూడాను. హనీ బన్నీ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది..