క్రేజీ రూమర్.. రాజకీయాల్లోకి సమంత.. ? ఆ పార్టీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్..? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. సమంత రాజకీయాల్లోకి వస్తుందా..? ఓ పార్టీ తరపున ప్రచారానికి రెడీ అవుతుందా..? ఈ వార్తల్లో నిజం ఎంత..?
ఖుషి సినిమాతో సక్సెస్ సాధించింది సమంత.. ఈసినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదరు చూసింది బ్యూటీ. ఈసినిమా సక్సెస్ తో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోంది శ్యామ్. రీసెంట్ గా శాకుంతలం, అంతుకు మందు యశోద, ఇలా ఫెయిల్యూర్స్ వస్తున్న క్రమంలో ఖుషి సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంది.
ఇక సినిమాలకు ఓ ఏడాది విరామం ప్రకటించింది సమంత. రీసెంట్ గా కొంత కాలం అమెరికా వెళ్ళి.. ఓ 20 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్యామ్.. తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది అనుకున్నారు. అయితే ట్రీట్మెంట్ తో పాటు.. టూర్లు కూడా ప్లాన్ చేసుకుంటూ... ఎంజాయ్ చేస్తుంది బ్యూటీ.
Samantha ruth prabhu
సినిమాలకు దూరంగా ఉన్న సమంత గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత త్వరలోనే పాలిటిక్స్ లో జాయిన్ కాబోతోంది అని తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంత కాదు సంచలనం సృష్టిస్తోంది. సమంత తెలంగాణ రైతన్నల కోసం ఇదివరకు ఎన్నో సార్లు మద్దతుగా నిలబడి రైతులకు సపోర్ట్ చేశారు అలాగే చేనేత వస్త్రాలకు కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Samantha
అయితే ఆమె చేసిన పనుల్లో ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానంగానే చేసింది. ఇలా తెలంగాణ ప్రజల కోసం చాలా సార్లు మద్దతుగా నిలిచిన సమంత.. రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి ఎంతో మంచి కలుగుతుందని బీఆర్ ఎస్ నేతలు భావించారట. అందుకే ఈసారి తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని.. తమ పార్టీకి సపోర్ట్ గా నిలబడాలని కోరారట.
Samantha
బిఆర్ఎస్ పార్టీకి తెలుపుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరడంతో ఈమె కూడా ఆసక్తి చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై స్పందించినటువంటి సమంతా అభిమానులు ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పాటిస్తున్నారు. సమంతకు రాజకీయాలు అంటే ఏమాత్రం ఆసక్తి లేదని తనకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమా రంగానికి ఏడాది పాటు విరామం ఇచ్చి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచనలలో ఉన్నారు.