శాకుంతలం డిజాస్టర్.. అంతా కర్మ అంటూ సమంత సంచలన పోస్ట్!
శాకుంతలం డిజాస్టర్ నేపథ్యంలో సమంత ఆసక్తికర కామెంట్ చేశారు. మహాభారతంలోని ప్రఖ్యాత శ్లోకం పోస్ట్ చేశారు.

Samantha
సమంత కెరీర్లో శాకుంతలం బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ రేంజ్ ఫెయిల్యూర్ ఆమెకు ఈ పదేళ్లలో ఎదురుకాలేదు. పైగా శాకుంతలం ఆమె లీడ్ రోల్ లో తెరకెక్కిన చిత్రం. హిట్ ఆర్ ఫెయిల్ ఆమె బాధ్యత వహించాల్సిందే. శాకుంతలం విషయంలో సమంత, దిల్ రాజు పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. దర్శకుడు గుణశేఖర్ ని ఈ జనరేషన్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది.
శాకుంతలం మూవీ మీద యూనిట్ కూడా నమ్మకం లేదు. హైప్ క్రియేట్ చేసి కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు. సమంత సింపతీ కార్ట్ కూడా వాడారనే ప్రచారం జరిగింది. ఆమె అనారోగ్యం, కన్నీళ్లు అంతా ప్రమోషన్స్ లో భాగమే అంటూ కొందరు ఎద్దేవా చేశారు. ఏడ్చినా, గగ్గోలు పెట్టినా సినిమా బాగోకపోతే ఎవరూ చూడరు. అది సూపర్ స్టార్ అయినా మెగా స్టార్ అయినా ఫ్లాప్ సినిమాను జనాలు పట్టించుకోరు.
అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, కార్టూన్ రేంజ్ గ్రాఫిక్స్ తో ఒక సీరియల్ తీసి ప్రేక్షకుల ముఖాన కొడితే ఆదరిస్తారు అనుకోవడం పొరపాటు. ఫస్ట్ షో నుండే శాకుంతలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మధ్యాహ్నానికి థియేటర్స్ ఖాళీ అయ్యాయి. కనీసం పోస్టర్స్, ప్రమోషన్స్ ఖర్చులు కూడా వచ్చే సూచనలు లేవు.
ఈ క్రమంలో సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శకుంతలగా ఆమె నటన, డబ్బింగ్ దారుణం అంటున్నారు. ఏ వన్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సమంత ఈ విమర్శలు జీర్ణించుకోవడం కష్టమే. శాకుంతలం ఫలితం మీద సమంత రియాక్ట్ కాకుండా ఉండలేకపోయింది. ఫస్ట్ వీక్ కూడా గడవక ముందే... ఫెయిల్యూర్ ని పరోక్షంగా ఒప్పేసుకుంది.
Samantha
మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నుండి ...
'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోత్స్వ కర్మణి..' శ్లోకాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ శ్లోకం అర్థం అందరికీ తెలుసు. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయం లేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానరాదు. ఏదేమైనా ముందుకు సాగిపోవాలని చెప్పడం.
ఓ ప్రయత్నంగా శాకుంతలం మూవీ చేశాము. దాని రిజల్ట్ నెగిటివ్ గా వచ్చింది. అదంతా కర్మ ఫలం. అది మన చేతుల్లో ఉండదు. నెగిటివ్ రిజల్ట్ వచ్చింది కదా అని సినిమాలు చేయకుండా ఉండలేం కదా... అని చెప్పకనే చెప్పారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.