Samantha: ఖాళీ సమయాన్ని అందుకు వాడేస్తున్న సమంత... హ్యాపీగా అక్కడికి చెక్కేసింది!
సమంత వెకేషన్ కి వెళ్లారు. దీవుల దేశం ఇండోనేషియాలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సమంత తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఖాళీ సమయాన్ని సమంత మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తున్నారు.
Samantha
సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఆమె ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. మిగిలి ఉన్న ఖుషి చిత్రీకరణ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఇక జులై 13న సిటాడెల్ షూట్ కూడా కంప్లీట్ చేసింది. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలియజేశారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా ఏడాది పాటు సమంత విరామం తీసుకోనున్నారట. సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట.
ఏడాది కాలాన్ని ఆమె చికిత్స కోసం కేటాయించనున్నారని సమాచారం. అందుకు సమంత అమెరికా వెళుతున్నారట. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందట. సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న మాట నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు.
Samantha
కాగా సమంత బాలి దేశానికి వెకేషన్ కి వెళ్లారు. దీవుల దేశం ఇండోనేషియాలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సమంత తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఖాళీ సమయాన్ని సమంత మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
Samantha
వారానికి పైగా సమంత ఇండోనేషియాలో ఉండనున్నారని సమాచారం. స్నేహితులు, సన్నిహితులతో సమంత ట్రిప్ కి వెళ్లారు. ఇక సమంత వెకేషన్ లుక్ కొత్తగా ఉంది. ఆమె పక్కా ట్రావెలర్ లుక్ లో అలరిస్తున్నారు. ఈ ట్రిప్ అనంతరం సమంత అమెరికా వెళ్లే సూచనలు కలవు.
Samantha
అధికారికంగా సమంత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. ఆమె ఒక హాలీవుడ్ చిత్రం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. చెన్నై స్టోరీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ మూవీలో వివేక్ కార్లా హీరో కాగా ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తారట. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.