సమంత అనారోగ్యం ఒక నాటకం, దేశం మారగానే వేషం మార్చేసింది... టాలీవుడ్ లో హాట్ టాపిక్!
సమంత తన చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకే అనారోగ్యం డ్రామాలు ఆడుతున్నాడనే వాదన వినిపిస్తోంది. ఆమె చర్యలు ఇందుకు కారణం అవుతున్నాయి.

Samantha
సమంత నటించిన గత రెండు చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్ర చేశారు. యశోద, శాకుంతలం సమంత లీడ్ రోల్ లో తెరకెక్కాయి. ఈ చిత్రాలను సక్సెస్ చేసేందుకు సింపతీ కార్డు వాడారని పలువురి వాదన. ఒకవేళ ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి ఆమె చెప్పేంత, కనిపించేంత పెద్దవి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Samantha
సమంత గత ఏడాది అక్టోబర్ లో మయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. చికిత్స తీసుకుంటున్నట్లు మంచం మీద ఉన్న ఫోటో షేర్ చేశారు. ఓ సుదీర్ఘ సందేశం కూడా పంచుకున్నారు. పలువురు సెలెబ్రిటీలు సమంతకు మద్దతు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పోస్ట్ చేశారు. యశోద విడుదలకు ఒక వారం రోజుల ముందు నాకు భయంకరమైన వ్యాధి అంటూ సమంత చెప్పడం కలిసొచ్చింది.
Samantha
యశోద హిట్ కొట్టింది. అదే సింపతీ ప్లాన్ శాకుంతలం మూవీకి కూడా వాడే ప్రయత్నం చేసింది. యశోద విడుదల తర్వాత సైలెంట్ గా ఉన్న సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో కొత్త అవతారం ఎత్తింది. తెల్ల బట్టలు, జపమాలతో కనిపించింది. ఇక ప్రమోషనల్ ఈవెంట్స్ లో కన్నీరు పెట్టుకుంది. దగ్గుతూ కనీస ఓపిక లేదని మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితి బయటపెట్టింది. హెల్త్ సెట్ కాలేదు, అయినా శాకుంతలం మూవీ మీదున్న ఇష్టంతో ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నానని ఆమె చెప్పారు.
Samantha
అలాగే విడుదలకు రెండు రోజుల ముందు సమంత తనకు జ్వరం సోకినట్లు ట్వీట్ చేశారు. అందుకే ఇకపై ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నా అంటూ దీన కథనాలు వల్లించారు. కట్ చేస్తే సమంత విదేశాల్లో తేలింది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. కట్టు బొట్టు మార్చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్ మైండ్ బ్లాక్ చేసింది. వారం రోజుల క్రితం జ్వరం, తీవ్ర నీరసమని చెప్పిన సమంత విదేశాలకు ఎలా వెళ్లారని పలువురు తప్పుబడుతున్నారు.
Samantha
ఈ క్రమంలో సమంత అనారోగ్య కథలు అంతా ఒట్టిదే. ఆమె చెప్పే మాటల్లో నిజం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంత ఆఫ్ స్క్రీన్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోయింది. శాకుంతలం మూవీ డిజాస్టర్ అయ్యింది . ఈసారి సమంత సింపతీ కార్డు పనిచేయలేదని అర్థమైంది.
నిర్మాత చిట్టిబాబు మొదటి నుండి ఈ విషయంలో సమంతను తప్పుబడుతున్నారు. గతంలో ఆయన సమంత డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. సమంతకు వచ్చిన మయోసైటిస్ చాలా చిన్నవ్యాధి. అది అందరికీ వచ్చేదే. ఈమె అదేదో ప్రాణాంతకమైన వ్యాధిమాదిరి హంగామా చేస్తుందన్నారు. ఇటీవల మరోసారి ఫైర్ అయ్యారు. ప్రతిసారి సింపతీ కార్డు వర్క్ అవుట్ కాదు. సమంత కన్నీరు పెట్టుకున్నంత మాత్రాన సినిమా చూడరు అన్నారు.
అయినా ఆమె స్టార్డం ఎప్పుడో పోయింది. అడపాదడపా సినిమాలు చేసుకుంటుంది. ఆమెకు పూర్వ వైభవం వచ్చే ఆస్కారం లేదు. శకుంతల వంటి పౌరాణిక పాత్రకు సమంతను ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. శాకుంతలం మూవీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదని చిట్టిబాబు అన్నారు.