Samantha: అర్థనగ్నంగా ఐస్ వాటర్లో కూర్చున్న సమంత... స్టార్ లేడీ సాహసానికి ఫ్యాన్స్ షాక్!
విదేశాల్లో ఉన్న సమంత సాహసాలు చేస్తుంది. ఆమె ఆరు నిమిషాలకు పైగా ఎముకలు కొరికే చల్లని నీళ్లల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Samantha
సమంత బాలీ ద్వీపంలో ఉన్నారు. వెకేషన్ లో భాగంగా మిత్రులతో ఇండోనేషియా వెళ్లారు. ఇండోనేషియా అందమైన దీవులకు పెట్టింది పేరు. బాలీ ద్వీపం బాగా ఫేమస్. ప్రస్తుతం సమంత అక్కడే ఉన్నారు. సమంత ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కాగా ఈ ట్రిప్ లో సమంత చేసిన ఓ సాహసం నెటిజెన్స్ ని ఆకర్షించింది.
Samantha
సమంత స్విమ్ సూట్ ధరించి ఐస్ వాటర్ లో దిగారు. ఆ వాటర్ టెంపరేచర్ ఎంతో తెలుసా 4 డిగ్రీలు. అంతటి చల్లని నీళ్లలో 6 నిమిషాలు సమంత పీకల్లోతు వరకు మునిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
Samantha
ఐస్ బాతింగ్ కూడా ఒక రకమైన థెరపీ. చల్లని నీళ్లలో కొన్ని నిమిషాలు ఉండటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సమంత అందుకే ఈ ఐస్ బాత్ ట్రీట్మెంట్ ట్రై చేశారు. అయితే ఇదంత సులభం కాదు. శరీరం బాధిస్తున్నా ఆరు నిమిషాలు గడపడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు.
Samantha Ruth Prabhu
గత ఏడాది మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత చాలా రోజు ఇంటికి పరిమితమయ్యారు. కోలుకున్నాక షూటింగ్స్ లో పాల్గొన్నారు. ఖుషి బాలన్స్ షూట్ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరో కాగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
Samantha
సిటాడెల్ షూట్ ఈ నెలలో కంప్లీట్ చేసింది. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. ఆమె లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
samantha
ఏడాది పాటు షూటింగ్స్ కి దూరంగా ఉందనున్న సమంత అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడని క్రమంలో అక్కడే చికిత్స తీసుకుంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వినికిడి. తర్వాత కెరీర్ పై ఫోకస్ పెడతారట.