MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ సీన్ చూస్తే భయం వేస్తుంది, నాచేత బలవంతంగా చేయించారంటున్న సదా, వైరల్ కామెంట్స్..

ఆ సీన్ చూస్తే భయం వేస్తుంది, నాచేత బలవంతంగా చేయించారంటున్న సదా, వైరల్ కామెంట్స్..

తన జీవితంలో ఒక్క సీన్ తనను బాగా ఇబ్బంది పెట్టిందని అంటోంది స్టార్  సీనియర్ హీరోయిన్ సదా. దర్శకుడు బలవంతంగా ఆ సీన్ చేయించాడంటుంది బ్యూటీ. ఇంతకీ ఏంటా సీన్.. ? 

2 Min read
Mahesh Jujjuri
Published : Sep 19 2023, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Heroine Sadaa

Heroine Sadaa

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం, కష్టాలు, నష్టాలు.., కన్నీళ్ళు,  ఇబ్బందులు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ లో.. కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులతో పాటు.. ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సంఘటన గురించి వివరించించి సీనియర్ హీరోయిన్ సదా. 

28

ఇండస్ట్రీలో హీరోయిన్స్‎తో మిస్ బిహేవ్ చేయడం, కమిట్ మెంట్ అడిగి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇలాంటి సంటనలు చాలా చూస్తుంటాం. సదా మాత్రం   ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన తేజ. 

38

సదా మాట్లాడుతూ.. ఆ సినిమా  విషయంలో  ఆ సీన్ చూస్తే ఇప్పటికీ  కంపరంగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది సదా.  జయం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో..  అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఓ దశాబ్ధం పాటు.. వరుస సినిమాలతో.. స్టార్ హీరోల సరసనన నటిస్తూ.. ఊపు ఊపేసింది. 

48

హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న క్రమంలో.. బుల్లితెరపై మెరిసింది బ్యూటీ. డాన్స్ షోలకు జడ్జ్ గా హడావిడి చేసింది. ఇక ప్రస్తుతం సినిమాలు లేకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. ఇంకా అమ్మడికి సరైన ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే సదాకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

58

జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదో పాటతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది సదా. ఆ సినిమాలోని ఓ సీన్ తన జీవితంలో మర్చిపోలేని చేదు గురుతుగా నిలిచిపోయింది అన్నారు సదా. నితిన్ కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు.

68

అయితే ఆసీన్ లో విలన్ గా గోపీచంద్ రాక్షసానందం పొందుతాడు..  గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను సినిమాలోనుంచి తీసేయండి అంటూ ప్రాధేయపడిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడట. 

78

అంతే కాదు సదా ఇబ్బంది చూసి.. విలన్ గా చేస్తున్న  గోపీచంద్ కూడా వద్దులేండి సార్.. ఆమె అంత ఇబ్బంది పడుతుంది అన్నారట. కాని తేజ మాత్రం  నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. ఇక అక్కడ ఉన్నవారు కూడా సదాకు  సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ తనకు జీవితంలో గుర్తుండిపోతుంది అంటున్నారు. 

88

ఇక ఆసీన్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ల బాగా ఏడ్చిందట సదా. అంతే కాదు..  పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ బాధపడుతుంట. అందుకే సినిమా చూస్తే.. ఆ సీన్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తుందట సదా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved