- Home
- Entertainment
- Regina Cassandra: ప్రెగ్నెంట్ అని చెప్పిన హీరోయిన్ రెజీనా.. కారణం తెలిసి షాక్ అవుతున్న జనాలు!
Regina Cassandra: ప్రెగ్నెంట్ అని చెప్పిన హీరోయిన్ రెజీనా.. కారణం తెలిసి షాక్ అవుతున్న జనాలు!
హీరోయిన్ రెజీనా కాసాండ్రా లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. తనకి తాను గర్భవతిని అని చెప్పానని చెప్పి ఆమె షాక్ ఇచ్చింది. పెళ్లి కానీ రెజీనా గర్భవతి కావడమేంటి... అసలు దీని వెనుకున్న కథేంటో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే.

తమిళ చిత్రం కండ నాల్ ముదాల్ తో వెండితెరకు పరిచయమైంది రెజీనా కాసాండ్రా(regina cassandra). మహేష్ బావ సుధీర్ డెబ్యూ మూవీ శృతి మనసులో శ్రీను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు సరైన హిట్ తగల్లేదు. మెగా హీరో సాయి ధరమ్ తో చేసిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి .
ఇక స్టార్ హీరోయిన్ అయ్యే దారులు రెజీనాకు ముసుకుపోయాయి. సౌత్ భాషల్లో పలు చిత్రాలు చేసినా ఎక్కడ కూడా ఆమె నిలదొక్కుకోలేక పోయారు. చిన్న చిన్న చిత్రాలు సిరీస్లు చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొస్తోంది. ఆచార్య(Acharya) మూవీతో ఐటెం భామగా కూడా మారారు. సానా కష్టం ఐటెం సాంగ్ లో చిరంజీవి(Chiranjeevi)తో మాస్ స్టెప్స్ వేసి అలరించారు.
కాగా రెజీనా లేటెస్ట్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. గతంలో తాను గర్భవతిని అంటూ అబద్ధం చెప్పానని ఒప్పుకున్నారు. రెజీనా అలా చెప్పడం వెనుక కారణం అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
రెజీనాకు మిస్ట్ దోయ్ అనే స్వీట్ అంటే చాలా ఇష్టమట. ఓ రోజు అది తినడం కోసం స్వీట్ షాప్ కి వెళ్లారట. షాప్ క్లోజ్ చేసిన ఓనర్ అమ్మడం కుదరదు అన్నాడట. ఎలాగైనా స్వీట్ తినాలని డిసైడ్ అయిన రెజీనా... నేను గర్భవతిని నాకు మిస్ట్ దోయ్ స్వీట్ తినాలన్న ఆశ బలంగా ఉంది. స్వీట్ ఇవ్వగలరంటూ రిక్వెస్ట్ చేసిందట.
గర్భవతి అనేసరి కరిగిపోయిన షాప్ ఓనర్ ఓపెన్ చేసి ఆమె అడిగిన స్వీట్ ఇచ్చాడట. ఒకప్పుడు జరిగిన ఆ ఫన్నీ సంఘటన ఫ్యాన్స్ తో రెజీనా పంచుకున్నారు. ఇక తెలుగులో రెజీనా రెండు చిత్రాలు చేస్తున్నారు. నేనేనా, శాకినీ ఢాకినీ టైటిల్స్ తో అవి తెరకెక్కుతున్నాయి.
వీటితో పాటు మరో ఐదు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ 31 ఏళ్ల చెన్నై బ్యూటీ వచ్చిన అవకాశాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. టాలెంట్, గ్లామర్ తో పాటు అదృష్టం అనేది చాలా అవసరం. అది లేక రెజీనా రేసులో వెనుకబడిపోయారు.