MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రైతు బిడ్డ మామూలు ముదురు కాదుగా.. రెండు రోజుల్లోనే హీరోయిన్‌ని పడేశాడు.. బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లో రచ్చరచ్చ..

రైతు బిడ్డ మామూలు ముదురు కాదుగా.. రెండు రోజుల్లోనే హీరోయిన్‌ని పడేశాడు.. బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లో రచ్చరచ్చ..

రైతు బిడ్డగా ఇన్నోసెంట్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్‌. కానీ తొలి రోజు నుంచే తన విశ్వరూపం చూపిస్తున్నారు. హీరోయిన్‌ని పడేశాడు. గురుడు పెద్ద ముదురే అనిపించుకుంటున్నాడు.

Aithagoni Raju | Published : Sep 06 2023, 07:09 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. ఇలా సారి ఉల్టా పుల్టా అని హోస్ట్ నాగార్జున తెలిపారు. అన్నట్టుగానే ఊహించని విధంగా హౌజ్‌ని నడిపిస్తున్నారు. ట్విట్ట్ టర్న్ లతో తీసుకెళ్తున్నాడు. హౌజ్‌లో ఇంకా ఎవరూ కన్ఫమ్‌ కాదని చెప్పేశాడు. ఉండేందుకు పవర్‌ సాధించాలని చెబుతూ, వారికి టాస్క్ లు ఇస్తున్నాడు. అయితే ఈ ఏడో సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉన్నాడు. ఎంట్రీనే తన ప్రత్యేకతని చాటుకున్నాడు. నాగార్జునకి బియ్యం బస్తా గిఫ్ట్ గా తెచ్చాడు. 
 

28
Asianet Image

ఆ తర్వాత తనదైన స్పెషాలిటీతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు ఆది నుంచే పులిహోర కలుపుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రారంభంలో ఇన్నోసెంట్‌గా వచ్చాడు. పాపం ఏం తెలియదు, అమాయకుడిలా కనిపించాడు. రైతు బిడ్డ కావడంతో అంతా సింపతి చూపించారు. కానీ అసలు విశ్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాడు. హీరోయిన్‌ని పట్టుకుని పులిహోర కలుపుతున్నాడు. దొరికిన వారికి పోప్‌ వేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

38
Asianet Image

అయితే తన మెయిన్‌ ఫోకస్‌ మాత్రం హీరోయిన్‌ రతిక రోజ్‌పై పెట్టాడు. ఆమె `బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది` చిత్రంలో హీరోయిన్‌గా నటించగా,  `నేను స్టూడెంట్‌ సర్‌` లో ఓ పాత్రలో మెరిసింది. ఇంకా రెండు మూడు సినిమాలు చేసినా తనకు గుర్తింపు రాలేదు. దీంతో తన ఐడెంటిటీ కోసం హౌజ్‌కి వచ్చినట్టు తెలిపింది. అయితే మొదటిరోజు బిగ్ బాస్‌ హౌజ్‌లో మేల్‌, ఫీమేల్‌ జంటలుగా ఏర్పడాలనే టాస్క్ పెట్టగా, అందుకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌.. రతికని ఎంపిక చేసుకున్నారు. తన బ్యాండ్‌ ఆమెకి ఇస్తానని వెల్లడించారు. 

48
Asianet Image

ఆమెతో తనతో బాగా మాట్లాడిందని, బాగా నచ్చిందని తెలిపారు. అందరి ముందు ఆ విషయాన్ని చెప్పే రతికని ఇంప్రెస్‌ చేశాడు. ఆ తర్వాత కూడా తాను ఎందుకు నచ్చానని అడగ్గా, సిగ్గుపడుతూ ఆమెని ఎందుకు నచ్చిందో తెలిపారు. తనదైన ఇన్నోసెంట్‌ మాటలతో ఆమెని బురిడి కొట్టించాడు. దీనికి అప్పుడే ఇంప్రెస్‌ అయ్యింది రతిక. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. బిగ్‌ బాస్‌ షో స్టార్ట్ అయి రెండు రోజుల్లోనే ఆమెని పడేశాడు. 

58
Asianet Image

రెండో రోజుల నీ హార్ట్ ని ఎవరికి ఇస్తావని రతిక.. పల్లవి ప్రశాంత్‌ని అడగ్గా, పెద్ద ప్రశ్నే అంటూ నీ హార్ట్ ని ఎవరికిస్తావని అడగ్గా నీకే ఇస్తా అని ఆమె చెప్పడంతో మనోడి ఆనందానికి అవదుల్లేవు. ఎగిరి గంతేశాడు. ముసి ముసి నవ్వులతో ఆమెని మరింత ఫిదా చేశాడు. ఆ తర్వాత తన హార్ట్ ని ఆమెకే ఇస్తానని, హార్ట్ లో నువ్వే ఉన్నావంటూ చెప్పాడు. అంతటితో ఆగలేదు. ఆమె తలని తన హార్ట్ వద్ద ఉంచి ఆ శబ్దం వినిపించాడు. ఈ దెబ్బకి రతిక పూర్తిగా పడిపోయినట్టుగా రియాక్ట్ అవడం విశేషం. 
 

68
Asianet Image

దీంతో మనోడి వేషాలపై అటు హౌజ్‌లో ఇటు బయట పెద్ద చర్చ నడుస్తుంది. అమాయకుడు అనుకుంటే మహా ముదురులాగే ఉన్నాడని, వచ్చి రావడంతోనే హీరోయిన్‌ని పడేశాడని కామెంట్లు చేస్తున్నారు. బయట మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాడు. హౌజ్‌లోనూ కెమెరా చూపులన్నీ ఈ జోడీపైనే పడింది. వీళ్లే హైలైట్‌గా నిలుస్తున్నారు. దీంతో రైతు బిడ్డ పెద్ద ముదురే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. 
 

78
Asianet Image

ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్‌ నేపథ్యంలో చూస్తే.. బిగ్‌ బాస్‌ తెలుగు 7లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ ది గజ్వేల్, సిద్దిపేట జిల్లా, కోల్గూర్‌ విలేజ్‌. గొడుగు సత్తయ్య, విజయలు పేరెంట్స్. డిగ్రీ కంప్లీట్‌ చేశాడు. తండ్రికి కుటుంబ పోషణ భారం కావడంతో చదువు మానేసి వ్యవసాయంలోకి దిగాడు. అయితే తన బాధలను వీడియో రూపంలో తెలియజేస్తూ యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా బాగా ఆదరణ లభించింది. టిక్‌ టాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యాడు. 

88
Asianet Image

నటనపై ఆసక్తితో డబ్బింగ్‌ వీడియోలు, యాక్టింగ్‌ వీడియోలు చేసి ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాలో పోస్ట్ చేసేవాడు. హీరోగా చిన్న చిన్న సీన్లు చేసేవాడు. షార్ట్ ఫిల్మ్స్ లోనూ చేశాడు. న్యూస్‌ ఛానెల్స్ లో దండోరా లాంటి ప్రోగ్రామ్స్ లో నటించాడు. రైతు కష్టాలను యూట్యూబ్‌లో వీడియోలుచేస్తూ పాపులర్‌ అయ్యాడు. ఐదు లక్షల ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. గత మూడేళ్లుగా బిగ్‌ బాస్‌ కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడు ఏడో సీజన్‌కి హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ జర్నీలో ఎన్నో అవమానాలున్నాయని ఎంట్రీ రోజు తెలిపిన విషయం తెలిసిందే. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories