- Home
- Entertainment
- తిట్టాడని సొంత తండ్రికే నరకం చూపించిన స్టార్ హీరోయిన్.. పంతానికి పోతే టార్చర్ తప్పదు
తిట్టాడని సొంత తండ్రికే నరకం చూపించిన స్టార్ హీరోయిన్.. పంతానికి పోతే టార్చర్ తప్పదు
ఒకప్పటి గ్లామర్ బ్యూటీ రంభ.. తనలోని వీక్‌నెస్‌ని బయటపెట్టింది. తనని తిట్టిన తండ్రికి ఆర్నెళ్లపాటు చుక్కలు చూపించినట్టు చెప్పింది. అసలు విషయాన్ని బయటపెట్టింది.

రంభ.. రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ని శాషించిన హీరోయిన్. కమర్షియల్ హీరోయిన్‌గా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. గ్లామర్ బ్యూటీగా అలరించింది. అందంతో మెస్మరైజ్ చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించి అలరించింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేసింది. అన్ని భాషల్లోనూ అదే జోరు మెయింటేన్ చేసింది.
ఏక కాలంలో నాలుగైదు భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణించింది రంభ. ఏడాదికి ఆమె నుంచి పది సినిమాల వరకు రిలీజ్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఒక పదేళ్లు పీక్ కెరీర్‌ని చూసింది రంభ. ఆ తర్వాత చివరగా ఐటెమ్ సాంగ్‌లు చేసింది. బొద్దుగా అందంగా, హాట్‌గా ఉండటంతో స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది. యంగ్ హీరోలతోనూ స్పెషల్ సాంగ్స్ చేసి కుర్రకారుకి చెమటలు పట్టించింది.
ప్రస్తుతం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అయిన రంభ.. ఈ క్రమంలో తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది. తనలోని వీక్ నెస్‌ని వెల్లడించింది. బాధపడిన సందర్భాలు చెబుతూ, ఆసక్తికర విషయాలను పంచుకుంది రంభ. తనని ఎవరైనా తిడితే తట్టుకోలేనని చెప్పింది. తన తప్పు లేకుండా ఎవరైనా తిడితే తాను భరించలేని, వారిపై కక్ష్య తీర్చుకుంటానని తెలిపింది. రియలైజ్ అయ్యేంత వరకు టార్చర్ చేస్తూనే ఉంటుందట.
అలా జరిగిన సందర్భాల గురించి చెబుతూ, తన ఫాదర్ విషయంలోనే జరిగిందని చెప్పింది రంభ. తండ్రి చిన్నప్పుడు ఏదో విషయానికి తిడితే ఏకంగా ఆరు నెలలపాటు నరకం చూపించిందట. ఆయనతో మాట్లాడలేదని, మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడటం లేదు, అది ఒక రకమైన టార్చర్ అని, చాలా ఇబ్బంది పెట్టానని చెప్పింది. ఓ సారి తండ్రి ఏదో అంటే అలిగి వెళ్లి మెట్ల కింద దాచుకుందట. ఫాదర్ ఉదయం షాప్‌కి వెళ్లి, నైట్ వచ్చేంత వరకు అక్కడే మెట్ల కిందనే దాక్కున్నానని, ఆయన వచ్చి సర్ది చెప్పేంత వరకు అలానే ఉన్నానని, ఆ తర్వాత లంచ్ చేసినట్టు చెప్పింది రంభ.
Rambha
తన తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెబుతానని, అదిఎవరైనా సరే, అదే సమయంలో తనని అనవసరంగా తిడితే మాత్రం ఊరుకోనని చెప్పింది. అయితే తను వ్యక్తిగతంగా చాలా ఎమోషనల్ అని, బాధ అనిపిస్తే వెంటనే ఏడ్చేస్తానని, అది సినిమా షూటింగ్గా?, సెట్టా? ఇంకా వేరే చోటా అనేది చూడనని, ఆ ఐదు నిమిషాల్లో ఆ బాధ అంతా వెళ్లిపోవాల్సిందే అని, ఆ తర్వాత ఫ్రీ అయిపోతానని చెప్పింది రంభ. సాక్షికి కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. ఇందులో.. తమకు స్వీట్ బిజినెస్ ఉందని, స్వీట్ తినడం ఇష్టమని, జీరో సైజ్ మెయింటేన్ చేయడం నాకు రాదని, స్వీట్ బాగా తింటానని చెప్పింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో విదేశాల్లో సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది రంభ.