MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Suma: సుమ గారి భర్త కాదు.. సుమ వదిలేసిన భర్త అనకుండా చూసుకో, రాజీవ్ కనకాలకు కౌంటర్

Anchor Suma: సుమ గారి భర్త కాదు.. సుమ వదిలేసిన భర్త అనకుండా చూసుకో, రాజీవ్ కనకాలకు కౌంటర్

Anchor Suma: సుమ, రాజీవ్ కనకాల టాలీవుడ్ లో రాణిస్తున్న జంటలలో ఒకరు. నిజానికి రాజీవ్ కనకాల కన్నా సుమకే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా చోట్ల రాజీవ్ కనకాలను సుమ గారి భర్తగా కూడా చెప్పుకుంటారు. ఇది తనకు అస్సలు నచ్చదని చెబుతున్నారు రాజీవ్ కనకాల. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 20 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సుమ భర్త అంటే మంట
Image Credit : KanakalaSuma/instagram

సుమ భర్త అంటే మంట

సుమ తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందే రాజీవ్ కనకాల ఫ్యామిలీ టాలీవుడ్లో తనకంటూ గుర్తింపును పొందింది. రాజీవ్‌ను పెళ్లి చేసుకున్నాక సుమకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే సుమ సొంతంగా పేరు ప్రతిష్టలతో పాటు విపరీతంగా ఆస్తులను సంపాదించింది. యాంకర్ సుమ అంటే చాలు ఎంతోమందికి విపరీతమైన ఇష్టం. ఆమె షో చేసిందంటే అందులో నవ్వులు పువ్వులు పూయాల్సిందే. సోషల్ మీడియాలోనూ సుమకు ఫాలోయింగ్ ఎక్కువే. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల మంచి నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే గత 20 ఏళ్లుగా యాంకర్ సుమ అందుకున్న విజయాన్ని మాత్రం ఆయన అందుకోలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సుమ వదిలేసిన భర్త
Image Credit : KanakalaSuma/instagram

సుమ వదిలేసిన భర్త

చాలామంది తనను సుమగారి భర్తగా గుర్తించడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు రాజీవ్ కనకాల. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సుమ గారి భర్త అంటే తనకు మండుతోందని అన్నారు. ‘ఆ మధ్యన ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఒక ముసలావిడ వచ్చి పలకరించింది. రాజీవ్ గారు బాగున్నారా అంది. నేను బాగున్నానని చెప్పాను. ఈలోపు వెనకనుంచి ఆమె భర్త కూడా వచ్చి ఎవరు? అని అడుగుతున్నారు. ఆమె రాజీవ్ కనకాల అని చెప్పినా ఆయనకు వినిపించలేదు. దాంతో ఈమె సుమ గారి భర్త అని చెప్పింది. అది వినగానే నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఈలోపు అక్కడ రాజా రవీంద్ర కూడా ఉన్నారు. అతనితో నేను ఈ ఏడాది ఆ పేరు నేను మార్చుకుంటాను.. రాజీవ్ కనకాలగానే పిలిపించుకుంటాను అని అన్నాను. దానికి రాజా రవీంద్ర సుమ గారి భర్త అన్నా ఫర్వాలేదు. సుమ వదిలేసిన భర్త అనిపించుకోకుండా చూసుకో’ అని జోకులేసాడు.

33
విడిగా ఉన్నది నిజమే
Image Credit : KanakalaSuma/instagram

విడిగా ఉన్నది నిజమే

వ్యక్తిగతంగా సుమ, రాజీవ్ ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. కొన్ని నెలల క్రితం మాత్రం వారి వ్యక్తిగత జీవితంలో దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. సుమ కూడా తన భర్త గురించి వారి రిలేషన్షిప్ లో వచ్చిన ఇబ్బందుల గురించి రాజీవ్ పడిన ఇబ్బందుల గురించి కూడా కొన్నిసార్లు బహిరంగంగానే మాట్లాడారు. ఒకసారి మాత్రం సుమతో విడిగా ఉండాల్సిన రోజులు వచ్చాయని రాజీవ్ వివరించారు. తన తల్లి చనిపోయిన తర్వాత తండ్రి దేవదాసు కనకాల ఒక్కరే మణికొండలోని ఇంట్లో ఉండే వారని, అప్పుడు సుమతో కలిసి పిల్లలతో నేను వేరే చోట ఉండే వాళ్ళమని చెప్పాడు రాజీవ్. నాన్నకు తోడుగా ఉండేందుకు కొన్నాళ్లు తాను మణికొండలోనే ఉన్నానని, అప్పుడు సుమ నేను విడిగా ఉండాల్సి వచ్చిందని వివరించారు. కొన్ని రోజులు దూరంగా ఉండటంతో తమ విడిపోయాయని కొందరు రాసేసారని.. అంతే కానీ తాము ఎప్పుడు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
Recommended image2
Birth Date: ఈ తేదీలలో పుట్టిన వారికి విపరీతమైన ఇగో.. వీరితో స్నేహం, శత్రుత్వం రెండూ డేంజరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved