నిర్మాతగా మారి ఇల్లు, ఆస్తులు అమ్ముకున్న తెలుగు హీరోయిన్, ఎంత నష్టపోయిందంటే..?
హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూసింది ఓ సీనియర్ బ్యూటీ. టాలీవుడ్, కోలీవుడ్ లను ఒక ఊపు ఊపింది. కాని నిర్మాతగా రాంగ్ స్టెప్ వేసి.. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెచ్చుకుందట.
90స్ లో తెలుగు,తమిళ స్క్రీన్ ను ఊపు ఊపి వదిలిపెట్టింది హీరోయిన్ రంభ. సౌత్ ఇండియాన్ లాంగ్వేజ్ లతో పాటు.. హిందీ, బెంగాళ, భోజ్ పూరిలో కూడా హీరోయిన్ గా రచ్చ చేసింది సీనియర్ బ్యూటీ. స్టార్ హీరోలస సరసన మెరిసి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. 90 దశకంతో పాటు.. 2000 లో కూడా ఆమె ప్రభావం బాగా కనిపించింది.
తెలుగు అమ్మాయి.. విజయవాడ కు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. కాని ఆమె 1992లో మలయాళ సినిమాతో తేరంగేట్రం చేసింది. 15 ఏళ్ల వయస్సులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆతరువాత రంభ పేరుతో మారు మోగి పోయింది. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అదే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హిట్ నటిగా పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత 1993లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు తెలుగు,తమిళంలో స్టార్ హీరోలందరి జతగా నటించింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోల సరసన మెరిసిన రంభ.. తమిళంలో రజనీ, కమల్, విజయ్, అజిత్, కార్తీక్, అర్జున్, ప్రశాంత్ వంటి ప్రముఖ నటులతో తెరపై సందడి చేసింది.
మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ప్రముఖ సౌత్ నటులతో కూడా రంభ జతకట్టింది. అదే సమయంలో, ఆమె సల్మాన్ ఖాన్ సరసన జుడ్వా మరియు బంధన్ చిత్రాలలో నటించి బాలీవుడ్ ను కూడా మెప్పించింది. అక్కడ కూడా ఆమెకు మంచి పేరు వచ్చింది.
అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా రంభ రాంగ్ స్టెప్ వేసిందని చెప్పాలి. ప్రొడక్షన్ లో దిగడం అంటే అనుభవం ఉండాలి. నిర్మాతగా చేయాలి అంటే సాహసం చేసినట్టే.. ఆ సాహసం చేసింది రంభ. నిర్మాతగా మారాలనుకున్న రంభ ఓ సినిమాను నిర్మించింది. తన సోదరుడు, జ్యోతిక మరియు లైలా ప్రధాన పాత్రలో ఈమూవీని నిర్మించింది.
కాని ఆ సినిమా రంభను నిరాశపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా రిలీజ్ తరువాత నష్టాలు రావడంతో ఆమె అప్పుల పాలయ్యింది. . అప్పు తీర్చేందుకు చెన్నైలోని మౌంట్ రోడ్డులోని తన ఇంటిని అమ్మేసిందట రంభ. మళ్లీ నటిగా వరుస సినిమాలు చేసి కాస్త కోలుకుందట రంభ.
ఇక సినిమాలు తగ్గుతున్న టైమ్ లో ఆమె కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 2010లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కెనడాలో సెటిల్ అవ్వగా.. అప్పుడప్పుడు చెన్నైకి వచ్చి వెళ్తుంటుంది రంభ.
2011లో చివరిగా మలయాళ సినిమా ఫిలింస్టార్ లో నటించింది రంభ. ప్రస్తుతం రంబా తన కుటుంబంతో టొరంటోలో నివాసం ఉంటున్నారు. సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రంభ. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను ప్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా అందిస్తుంటుంది.
Rambha
ఇక ఈమధ్యలో రంభ తన భర్తకు విడాకులు ఇచ్చిందన్న రూమర్ కూడా వచ్చింది. ఇద్దిరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఆ సమాచారాన్ని రంభ ఖండించింది. వెండితెరతో పాటు ఆమెబుల్లితెరపై కూడా జడ్జ్ గా సందడి చేసింది. ప్రస్తుతం ఆమె రీ ఎంట్రీపై పలు ఊహాగానాలు వినిపనిస్తున్నాయి.