హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా... ఎంత అందంగా ఉందో చూశారా?
హీరోయిన్ రంభ కూతురిని చూశారా? అందంలో తల్లికి ఏమాత్రం తగ్గదు. రంభ కూతురు ఫోటోలు వైరల్ అవుతుండగా ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని షాక్ అవుతున్నారు.

ఇండియన్ సినిమాను ఏలిన అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ లో రంభ ఒకరు. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్లకే చదువుకు బ్రేక్ ఇచ్చి హీరోయిన్ గా మారింది. 1992లో విడుదలైన మలయాళ చిత్రం సర్గం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.
Rambha
అదే ఏడాది రాజేంద్రప్రసాద్ కి జంటగా కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు చేసింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్. అనంతరం శోభన్ బాబు, శారద, వాణిశ్రీ, హరీష్ ప్రధాన పాత్రలు చేసిన ఏమండీ ఆవిడ వచ్చింది... చిత్రంలో నటించింది.
Rambha
ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. మూవీ మూవీకి తన ఇమేజ్ పెంచుకుంటూ పోయిన రంభ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలు చేసింది.
Rambha
90లలో రంభ కుర్రాళ్ళ కలలు రాణి. ఎక్స్పోజింగ్ కి ఏమాత్రం వెనుకాడేది కాదు. కెరీర్ నెమ్మదించాక రంభ వివాహం చేసుకుంది. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాథన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక ఆమె కెనడాలోనే సెటిల్ అయ్యింది.
ఇక రంభకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తె టీనేజ్ కి వచ్చేసింది. రంభ కూతురు ఫోటోలు వైరల్ అవుతుండగా అందంలో రంభకు ఏమాత్రం తక్కువ కాదు. చాల క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో రంభకు ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు...