- Home
- Entertainment
- నవంబర్లోనే పెళ్లి ముగిసింది, ఎలా జరిగిందో చెప్పనే లేదు... రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
నవంబర్లోనే పెళ్లి ముగిసింది, ఎలా జరిగిందో చెప్పనే లేదు... రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
స్టార్ లేడీ రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి ఎప్పుడని మీడియా అడగడంతో ఆమె ఆల్రెడీ జరిగిపోయిందంటూ బాంబు పేల్చారు.

Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ సింగ్ 2021లో ప్రియుడిని పరిచయం చేశారు. నటుడు జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి రకుల్ కి పెళ్లి కష్టాలు మొదలయ్యాయి. మీ వివాహం ఎప్పుడంటూ ప్రతిసారి మీడియా వెంటపడుతుంది. సందర్భం ఏదైనా కానీ మీడియా ముందుకు వస్తే... ఆమె వివాహ ప్రస్తావన తెస్తున్నారు.
Rakul Preeth Singh
ఈ ప్రశ్నలపై పలుమార్లు రకుల్ అసహనం ప్రదర్శించారు. తాజాగా మరోసారి ఆమె ఫైర్ అయ్యారు. వారానికోసారి నా పెళ్లి వార్తలు వస్తూనే ఉంటాయి. మీ కథనాల ప్రకారం నాకు గత ఏడాది నవంబర్లోనే పెళ్లయిపోయింది. ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో నాకు చెప్పనే లేదూ అంటూ సెటైర్స్ వేసింది. రకుల్ సమాధానాలకు మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. నేను చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పారు.
Rakul Preeth Singh
గతంలో రకుల్ తమ్ముడు అమన్ వచ్చే ఏడాది మా అక్క వివాహం ఉండొచ్చన్నారు. దీంతో రకుల్ పెళ్లిపై పుకార్లు ఎక్కువయ్యాయి. ఆమె మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.ఇక రకుల్ వరుస ప్లాప్స్ నుండి బయటపడ్డారు. ఎట్టకేలకు ఆమెకు హిట్ పడింది. రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి జీ5 లో నేరుగా విడుదలైంది. బోల్డ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది.
Rakul Preeth Singh
వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది.
Rakul Preeth Singh
కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారు. ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు.